ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే... మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ సడలింపు జరగడంతో మద్యం దుకాణాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీనితో మద్యం బాబులు మళ్లీ చెలరేగిపోతున్నారు. ఇక మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడిన గొడవ... నిండు ప్రాణం మట్టిలో కలిసిపోయింది. 


ఇకపోతే ఈ దారుణ  సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరు సిటీలోని రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ల పరిధిలో దారుణంగా నిందితుడు హత్యకు గురయ్యాడు. యెలహంక ప్రాంతానికి చెందిన రాజు, రామమూర్తి నగర్ లోని బోవి కాలనీకి చెందిన నేత అనే యువకుడు స్నేహితులు. ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది. ఇక ఈ తరుణంలో కర్ణాటకలో వైన్ షాపులు ప్రారంభం అవ్వడంతో ఇద్దరూ కలిసి మద్యం తెచ్చుకొని నేత ఇంట్లో తాగడం జరిగింది.


ఇది ఇలా ఉండగా తెచ్చుకున్న మద్యంలో ఎక్కువ శాతం రాజు తాగడంతో.. నేత అతనితో గొడవకు దిగాడు. ఇక ఇద్దరు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. నేత రాజు తలను గోడకేసి కొట్టి ప్రెజర్ కుక్కర్ ‌తో  బలంగా బాదాడు. దీనితో రాజు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడిని అరెస్టు చేయడం జరిగింది. రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనలో ముఖ్య నిందితుడు నేత గతంలో కూడా ఒక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చినట్లు పోలీస్ అధికారులు తెలియజేయడం జరిగింది. దేశంలో మద్యం షాప్ లు మళ్లీ తెరుచుకోవడంతో ఇలాంటి సంఘటనలు సంభవించడం తిరిగి ప్రారంభం అవ్వడంతో మళ్లీ ప్రజలలో భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: