ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇ ఉత్తరాంధ్రలోని కీలక జిల్లా అయిన విశాఖ జిల్లాలో ఓ ఎమ్మెల్యేకు ఇస్తున్న ప్రాధాన్యం విశాఖ వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారింది, వాస్తవానికి విశాఖ జిల్లా పార్టీ బాధ్యతలు అన్ని వైసీపీకి చెందిన సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వ‌ర్యంలో నడుస్తున్నాయి. ఇక జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు వైజాగ్ ఇన్చార్జ్‌ మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబు హ‌వా కూడా ప్రస్తుతం వైజాగ్ లో కొంత వరకు నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే విజయ్ సాయి రెడ్డి, కన్నబాబు డామినేషన్ తో స్థానిక ఎమ్మెల్యే లకు మిగిలిన నేతలకు అంత గా ప్ర‌యార్టీ ఉండటం లేదన్న అసంతృప్తి అయితే విశాఖ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే జగన్ మాత్రం ఎవరితోనూ సంబంధం లేకుండా పెందుర్తి ఎమ్మెల్యే అన్నపరెడ్డి అదీప్ రాజ్‌కు మంచి ప్ర‌ధాన్యం ఇస్తున్నార‌న్న టాక్‌ విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో ఉంది.

 

ఈ వయసులో చాలా చిన్నవాడు అయిన అదీప్ రాజ్‌కు గత ఎన్నికలకు ముందే జగన్ పెందుర్తి సిటీ ఇవ్వడంతో పాటు అన్ని విధాల ప్రోత్సహించారు. ఆ ఎన్నికల్లో అదీప్ రాజ్ టీడీపీకి చెందిన సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి పై ఘన విజయం సాధించారు. గ‌త‌ ఎన్నికల్లో విశాఖ సిటీ లోని నాలుగు సీట్లు వైసీపీ ఓడిపోయినా పెందుర్తిలో మాత్రం విజయం సాధించింది. యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు అయిన అదీప్ రాజ్ స్థానికంగా మాజీ మంత్రిగా ఉన్న బండారు అండ్ ఫ్యామిలీ అరాచ‌కాల‌పై తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. 

 

చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అదీప్‌కు ప‌ట్టం క‌ట్టారు. ఇక ఇప్పుడు జిల్లాలో మ‌రో యువ ఎమ్మెల్యేతో పాటు మంత్రి, ఎంపీ, ప‌లువురు కీల‌క నేత‌లు ఉన్నా జ‌గ‌న్ దృష్టిలో అదీప్ రాజ్‌కు ఉన్న ప్ర‌ధాన్య‌మే వేరుగా ఉంటోంద‌ట‌. నిన్న గ్యాస్ ప్ర‌మాదం నేప‌థ్యంలో విశాఖ వెళ్లిన‌ప్పుడు జ‌గ‌న్ కొంద‌రు మంత్రుల పేర్లు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించినా అదీప్ రాజ్‌ను ప్ర‌త్యేకంగా అక్క‌డ ప్ర‌మాద తీవ్ర‌త త‌గ్గే వ‌ర‌కు ప‌నుల‌ను జాగ్ర‌త్త‌గా ప‌ర్య‌వేక్షించాలి అని చెప్పార‌ట‌. దీంతో  ఇప్పుడు ఈ న్యూస్ వైసీపీ వ‌ర్గాల్లో బాగా నానుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: