ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను గజగజ వ‌ణికిస్తోన్న క‌రోనా వైరస్ కట్టడి చేసేందుకు కొన్ని వేల పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా ఏయే రూపంలో వ్యాప్తి చెందుతుంది అన్న దానిపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. తాజాగా కరోనా వైరస్ శృంగారం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది అన్న ప్రచారం అయితే ఉంది. దీనిపై చైనా పరిశోధకులు తాజాగా చేసిన ఒక అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. క‌రోనాకు.. శృంగారానికి మధ్య సంబంధం ఉందా ? అన్న విషయాన్ని వారు పూర్తిగా వెల్లడింయ‌క పోయినా కొన్ని సందేహాలు అయితే వ్యక్తం చేశారు.

 

చైనీస్ శాంగ్‌క్వియు వైద్యుల పరిశోధన ప్రకారం.. కరోనా వైరస్ సోకిన 38 మంది పురుషుల వీర్యాన్ని పరీక్షించారు. ఇందులో ఆరుగురి వీర్యంలో వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు. ఆ ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. ఇద్దరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. దీనిని బ‌ట్టి మాన‌వుడి వీర్యం లో క‌రోనా అయి తే ఉంటుంద‌న్న ది క్లారిటీ వ‌చ్చే సింది. ఇక ఈ క్ర‌మంలోనే శృంగారం చేసే ట‌ప్పుడు పురుషుల నుంచి ఈ వైర‌స్ సంభోగం చేసే స్త్రీ కి సంక్ర‌మిస్తుంద‌న్న‌ది తెలుస్తోంది. ఈ విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. 

 

శాంగ్ క్వియు ప‌రిశోధ‌కులు  జామా నెట్‌వర్క్ ఓపెన్ అనే జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. ఒకవేళ కరోనా వైరస్ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ అయితే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని పరిశోధకులు తెలిపారు. అయితే ఇదే చైనా దేశంలో మ‌రి కొంత మంది చిన్న చిన్న శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న ల ప్ర‌కారం మాత్రం క‌రోనా వైర‌స్ అనేది మానువ‌డి వీర్యంలో గుర్తించ బ‌డలేదు. ఏదేమైనా ఈ రెండు ప‌రిశోధ‌న‌ల‌ను బ‌ట్టి క‌రోనాకు, వీర్యంకు మాత్రం స‌న్నిహిత సంబంధం ఉంద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: