చాలా రోజుల తరువాత దేశ వ్యాప్తంగా మద్యం షాపులు తెరుచుకోవడంతో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాలతో  ఊపిరి పీల్చుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో మద్యం షాపులు ఓపెన్ కాగా రెండు రోజుల క్రితం  తెలంగాణ లో కూడా ఓపెన్ అయ్యాయి. తొలి రోజు మద్యం అమ్మకాల్లో ఆంధ్రా రికార్డు సృస్టించగా రెండో రోజు 197 కోట్ల మద్యం అమ్మకాలతో కర్ణాటక ఆల్ టైం రికార్డు సృష్టించింది. వీటితోపాటు తెలంగాణ లో కూడా తొలి రోజు 90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. ఇక  నిన్న తమిళనాడు లో కూడా ప్రభుత్వం ఆదీనంలో నడిచే మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం తో చెన్నై లో మాత్రం మద్యం షాపులకు అనుమితివ్వలేదు.  
 
చాలా రోజుల తరువాత షాపులు ఓపెన్ కావడంతో మద్యం కొనుగోలు కూడా మందు బాబులు ఎగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 3700 షాపులు ఓపెన్ కాగా తొలి రోజు ఏకంగా 170 కోట్ల మద్యం అమ్మకాలు జరిగిగాయట. చెన్నై లో కూడా ఓపెన్ చేసి ఉంటే మొత్తం 200కోట్ల మార్క్ చేరుకొనేది. ఇదిలావుంటే కరోనాను అరికట్టడం లో మాత్రం తమిళనాడు దారుణంగా విఫలమౌవుతుంది. గత నాలుగు రోజుల నుండి అక్కడ రోజుకు 500 కు పైగా  కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు  మొత్తం కేసుల సంఖ్య 5000 దాటగా 37 మరణాలు సంభవించాయి. సౌత్ లో కరోనా మరణాల్లో అలాగే  కరోనా కేసుల్లో తమిళనాడే మొదటి స్థానంలో వుంది. అది చాలదన్నట్లు ఇప్పుడు మద్యం షాపులు కూడా తెరిచింది. దాంతో కరోనా ప్రభావం మరింత పెరుగుతుందని జనాలు హడలిపోతన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: