ఆఫ్ఘ‌నిస్థాన్‌పై క‌రోనా  ప్ర‌తాపం చూపుతోంది. ఈ చిన్నిదేశంలో క‌రోనా వేగంగా విస్త‌రిస్తున్న‌ట్లు అంత‌ర్జాతీయ నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. కేవ‌లం 3కోట్ల జ‌నాభా క‌లిగి ఉండే ఈ దేశంలో ప్ర‌స్తుతం లాక్‌డౌన్ అమ‌ల‌వుతోంది. దేశ రాజ‌ధాని కాబుల్ మిన‌హా మిగిలిన‌వ‌న్ని చిన్న న‌గ‌రాలే. కాబుల్‌లో దాదాపు 50ల‌క్ష‌ల జ‌నాభా ఉంటుంది. క‌రోనా విరుచుకుప‌డే ప్ర‌మాదం పొంచి ఉండ‌టంతో వైద్య స‌దుపాయాల్లేని ఈ ఉగ్ర‌వాద స్థావ‌ర దేశం ఇప్పుడు బిక్కుబిక్కుమంటోంది. అయితే వైద్య స‌దుపాయ‌లు లేక‌పోవ‌డంతో ఇక్క‌డ ప‌రీక్ష‌లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయ‌ని ఇటీవ‌ల ఆ దేశ ఆరోగ్య స్థితిగ‌తుల‌పై అంత‌ర్జాతీయ సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలో వెల్ల‌డైంది. కేవ‌లం 7కేంద్రాల్లో మాత్ర‌మే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.


ఇదిలా ఉండ‌గా ఆ దేశ ఆరోగ్య‌శాఖ మంత్రిగా ప‌నిచేస్తున్న ఫిరోజుద్దీన్‌ ఫిరోజ్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డం ఇప్పుడు అక్క‌డి పాల‌కుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. క‌రోనా వైర‌స్ దేశంలో ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఆయ‌న వ‌రుస‌గా అధికార యంత్రాంగం, పాల‌కుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. అత‌డిని క‌లిసిన వారిలో ప‌లువురు వ్యాపార ప్ర‌ముఖులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త వారం రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండ‌గా క‌రోనా ల‌క్ష‌ణాల‌ను గుర్తించిన వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. పాజిటివ్ రావ‌డంతో అధికారులు అల‌ర్ట‌య్యారు.  దీంతో ఆయన్ను క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు.


ఇక గడిచిన 24 గంటల్లో ఆఫ్ఘనిస్తాన్ దేశ వ్యాప్తంగా కొత్తగా 215 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాని అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3700కి చేరింది. ఇక ఈ మహమ్మారి బారినపడి దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు వంద మంది వరకు ప్రాణాలు విడిచారు. అయితే కరోనా మహమ్మారి చికిత్సలో కీలక ముందడుగు వేశామని చైనా శాస్త్రవేత్తలు గురువారం ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు అంద‌రిలో ఆశ‌లు రేపుతోంది. కోవిడ్‌-19కు దేశంలో తొలి వ్యాక్సిన్‌ను కోతులపై విజయవంతంగా పరీక్షించామని డ్రాగన్‌ సైంటిస్టులు తెలిపారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: