విశాఖకు అన్నీ ఉన్నా అయిదవతనం లేదని అంటారు. జరుగుతున్న ఘటనలు చూస్తే అదే నిజం అనిపిస్తుంది. విశాఖ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా స్థితి తయారైంది. అందాల నగరం, సుందర నగరం అంటారు, కానీ విశాఖను మాత్రం ఈ బిరుదులతోనే సరిపెడతారు.

 

అభివ్రుధ్ధి దగ్గరకు వచ్చేసరికి పక్కన పెడతారు. అటువంటి విశాఖకు రాజయోగం కల్పించాలని జగన్ ఆశించారు, ఆరాటపడ్డారు. కానీ ఆచరణలో మాత్రం అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. గత ఏడాది జగన్ అసెంబ్లీలో జగన్ విశాఖను రాజధాని చేస్తామని ప్రకటించారు. విశాఖను పాలనారాజధానిగా ప్రకటిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఆ దిశగా జగన్ ప్రయత్నాలు చేస్తూంటే రాజకీయ దుమారం మరో వైపు సాగుతోంది.

 

ఇంకోవైపు న్యాయపరమైన కేసులు ఉన్నాయి. శాసనమండలిలో బిల్లులు ఆగిపోయి సెలెక్ట్ కమిటీకు వెళ్లాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వచ్చింది. అయినా సరే విశాఖ రాజధాని అన్న జగన్ ఆలోచనలు ఆ దిశగానే సాగుతున్నాయి. అయితే ఇపుడు విశాఖలో గ్యాస్ లీక్ ఘటనతో విశాఖ రాజధాని ప్రకటకకు గట్టి షాక్ తగిలిందని భావిస్తున్నారు.

 

ఇంతకాలం విశాఖ రాజధానికి పనికిరాదని, అక్కడ ప్రక్రుతిపరమైన విపత్తులు ఉన్నాయని, తరచూ తుఫాన్లు కూడా విశాఖలో చోటు చేసుకుంటూ ఉంటాయని, హుదూద్ వంటి తుఫాన్లు వస్తే కోలుకోవడం కష్టమేనన్న భావన కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వీటిని పట్టుకుని రాజకీయ పార్టీలు కొన్ని విశాఖ రాజధాని వద్దని వైసీపీ మీద పోరాటం చేస్తున్నాయి.

 

ఇపుడు గ్యాస్ లీక్ కారణంగా విశాఖ ప్రమాదనగరం అన్నది మరో మారు బయటపడింది. విశాఖలో ప్రమాదకరమైన రసాయన పరిశ్రమలు అనేకం ఉన్నాయని అంటున్నారు. విశాఖలో ఓవైపు ప్రక్రుతి విపత్తులు, మరో వైపు పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఇదే విధంగా జరిగితే రాజధాని ఏర్పాటు చేయడం ఎలా సాధ్యపడుతుందని కొత్త వాదన తెస్తున్నారు. మొత్తానికి విశాఖ సేఫ్ కాదని కొత్త పల్లవిని అందుకుంటున్నారు. దీనికి అడ్డుకట్ట జగన్ ఎలా వేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: