స‌రిహ‌ద్దు రేఖ వ‌ద్ద పాకిస్థాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతూనే ఉంది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌సైన్యానికి భార‌త ఆర్మీ చ‌క్క‌టి బుద్ధిని చెబుతున్నాయి. శుక్ర‌వారం కూడా స‌రిహ‌ద్దు వ‌ద్ద వ‌క్ర‌బుద్ధిని ప్ర‌ద‌ర్శించిన పాకిస్థాన్ సైన్యం భార‌త బ‌ల‌గాలు దాడులు నిర్వ‌హించాయి.  పుంచ్ సెక్టార్‌లోని ఎల్వోసీ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడింది.  దాడుల‌ను తిప్పి కొట్టేందుకు భారత సైన్యం.. పాకిస్థాన్‌పై ఎదురు కాల్పులకు దిగింది. పాక్‌ ఔట్‌పోస్ట్‌లపై కాల్పుల‌తో విరుచుకుప‌డింది. ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు పాకిస్థాన్ జవాన్లు హతమై ఉంటార‌ని భార‌త ఆర్మీ ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. 

 

అయితే గాయ‌ప‌డిన పాక్ సైనికుల సంఖ్య మాత్రం ఎక్కువ‌గానే ఉంటుంద‌ని భార‌త ఆర్మీ అంచ‌నా వేస్తోంది. ఓ వైపు భార‌త ప్ర‌భుత్వం కరోనా కట్టడిలో నిమ‌గ్న‌మై ఉండ‌గా చొర‌బాట్ల‌కు ఇదే త‌గిన స‌మ‌య‌మ‌ని  పాకిస్థాన్ తన వక్రబుద్దిని చూపిస్తోంది. ఇదిలా ఉండ‌గా బుధవారం భారత బలగాలు మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్ రియాజ్‌ నైకూను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. కాగా.. గత మార్చి నెలలో కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యం పాక్ ప్రేరేపతి ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

భారత్‌లోకి చొరబడేందుకు ఇదే తగిన సమయమని ఉగ్రవాదులు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే భారత ఆర్మీ మాత్రం పాక్ ఉగ్రవాద మూకలను సరిహద్దు వద్ద మట్టుబెట్టేస్తూనే ఉంది. భారత్‌లో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి దాదాపు ముప్పై మంది ఉగ్రవాదుల్ని సైన్యం కాల్చిచంపడం గమనార్హం.భార‌త ఆర్మీ చేతిలో పాకిస్థాన్ సైన్యం ప‌దేప‌దే చావు దెబ్బ‌తింటున్నా బుద్ధిమార్చుకోవ‌డం లేదు.ఇదిలా ఉండ‌గా పాకిస్థాన్‌లో క‌రోనా వైర‌స్ ఉధృతి పెరుగుతుండ‌టంతో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్ప‌టికే దాదాపు 25వేల‌కు చేరువలో పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డం గ‌మనార్హం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: