భారతీయులం అంటూ ఎప్పటికప్పుడు సంకేతాలు వస్తూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంది.  ఈ సమయంలో అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు.  ఈ నేపథ్యంలో కరోనాపై పోరులో మతాలు, సంప్రదాయలను పక్కన పెట్టి చాలా మంది మానవత్వం చాటుకుంటున్నారు. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది ముఖ్యంగా వీటిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  ఢిల్లీకి చెందిన ఇమ్రానా సైఫీ అనే ఒక ముస్లిం మహిళ తన వంతుగా అన్ని గుళ్లలో, మసీదుల్లో, ఇళ్లల్లో, వీధుల్లో శానిటైజేర్‌‌ను స్ర్పే చేస్తూ అందరికీ ఆదర్శంనగా నిలుస్తోంది. బుర్ఖా వేసుకుని గుడి లోపలికి వెళ్లి ప్రతి మూలను శానటైజ్‌ చేస్తోంది. దానికి పూజార్లు కూడా సహకరిస్తున్నారని, ఇలా చేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఢిల్లీకి చెందిన ఇమ్రానా ఏడో తరగతి వరకు చదువుకున్నారు.

 

 గుడి,మసీదు, గుర్వాదారా అనే తేడా లేకుండా బుర్కా ధరించి శానిటైజర్ ట్యాంక్ భుజానికి వేసుకొని తన బాధ్యలను నిర్వహిస్తోంది. నవదుర్గా ఆలయంలో ఆమె శానిటైజ్ చేస్తుండగా.. తీసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. మత సామరస్యాన్ని కాపాడటానికే తాను ఇలా చేసినట్టు వెల్లడించారు. చాలా మంది మత గురువులు ఆలయాల్లోకి స్వాగతం పలికారని చెప్పారు. తాను మసీదు నుంచి వచ్చే అజాన్, గుడి నుంచి వినిపించే గంట శబ్దాలకు ఒకేలా స్పందిస్తామని అంటున్నారు. కరోనా కాలం మొదలైనప్పటి నుంచి ఆమె కాలనీలోకి నలుగురు మహిళలతో “ కరోనా వారియర్స్‌” అని టీమ్‌గా ఏర్పడి శానిటైజర్‌‌ స్ర్పే చేస్తోంది.

 

ఢిల్లీలోని జఫ్రాబాద్‌, ముస్తఫాబాద్‌, చాంద్‌భాగ్‌, నెహ్రూ విహార్‌‌, శివ్‌ విహార్‌‌, బాబూ నగర్‌ తదితర ప్రాంతాల్లో రోజూ శానిటైజర్‌‌ మిషన్‌ వేసుకుని కనిపిస్తుంది.  మనమంతా ఒకటే అని నిరూపించాలనుకుంటున్నాను.   మేం ఎక్కడ ఎవరితో ఇబ్బంది పడలేదు. ఇది చాలా భయంకరమైన వ్యాధి అని అందరికీ తెలుసూ అందుకే మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేదు  అని ఇమ్రానా చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: