దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడం జరిగింది. దీనితో రోజువారి జీవనానికి ఆటంకం కలుగుతుందని వలస కార్మికులు వాళ్ళ సొంత ఊరుకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలోనే కర్ణాటకలోని బెంగళూరు నగరంతోపాటు వివిధ ప్రాంతాలలో ఉన్న రెండు లక్షల మంది వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వీరంతా కూడా మా సొంత ఊర్లకు వెళ్ళిపోదామని కర్ణాటక ప్రభుత్వం వద్ద వారి పేర్లు నమోదు కూడా చేసుకున్నారు. 

 

IHG

 

దీనితో కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద చుక్కెదురయింది. అంతేకాకుండా చాలా రోజుల నుంచి భారీ స్థాయిలో అద్దెలు వసూలు చేస్తుంది జల్సాలు చేస్తున్న ఇంటి యజమానులు ఎలా ఇబందులు ఎదురుకోవాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా సుమారు లక్షమంది పైగా వాళ్ళ ఇంటిని ఖాళీ చేసి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధం అవడంతో ఇంటి యజమానులకు పెద్ద చిక్కే ఎదురయింది. గత 45 రోజులుగా కూలీ పనులు లేక వలస కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

IHG


ఇది ఇలా ఉండగా మరోవైపు బెంగుళూరు నగరం లో కొంత మంది వలస కార్మికుల ఇంటి యజమానులు వారి కివెంటనే అద్దె కట్టాలి అని కరెంటు నీళ్లు బిల్లులు కట్టాలని వలస కార్మికులు పై యజమానులు ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వలస కార్మికులు అయితే... ఏది ఏమైనా కానీ మా సొంత ఊరిలోనే బతుకుతాం బెంగళూర్ లో మాత్రం మేము జీవించలేను అని వలస కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

IHG


ఇక కర్ణాటకలో జీవనం కొనసాగిస్తున్న వలస కార్మికులందరినీ వారి సొంత ఊర్లకు పంపించడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకముల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక మొదటి విడతలో భాగంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, త్రిపుర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక రైళ్లలో వారి స్వస్థలకి పంపించాలని ప్రభుత్వం అన్ని రకముల ఏర్పాట్లు చేశారు. ఇక రెండో విడతగా తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ప్రజలను వారి స్వస్థలాలకు పంపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక శుక్రవారం వలస కార్మికుల తో ఒకటి లేదా రెండు రైలు మొదలవుతాయి అని అధికారులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: