లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సడలింపులిచ్చింది. దీంతో 6 హైదరాబాద్ లో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా బోసిపోయిన రోడ్లు తిరిగి వాహన రాకపోకలతో సందడిగా మారాయి. ఇదిలా ఉంటే మొన్నటి నుంచి తెలంగాణ లో మద్యం షాపులు ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి మందు బాబుల చిందులు అంతా ఇంతా కాదు. అయితే కరోనాని అరికట్టేందుకు మొన్నటి వరకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. మద్యం షాపులు ఓపెన్ చేసిన తర్వాత అవన్నీ పక్కన బెట్టారని విమర్శకులు అంటున్నారు.  వాస్తవానికి ప్రభుత్వం మద్యం షాపులకు గట్టి సూచనలు ఇస్తూ షాప్స్ ఓపెనింగ్ కి పరిమిషన్ ఇచ్చింది. 

 

మద్యం దుకాణం వద్ద ఖచ్చితంగా క్యూ లైన్ ఉండాలని.. భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలని... ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలని.. అలాంటి వారికే మద్యం అమ్మాలని చెప్పింది.  కానీ చాలా చోట్ల ఈ నిబంధనలు ఏమాత్రం పాటిడచం లేదు.. మద్యం అమ్మె యజమానులు సైతం ఇలాంటి కఠిన నిబంధనలు పాటిడచడం లేదు. ఈ నిబంధనలను గాలి కొదిలేసి ఇష్టానుసారంగా మద్యం అమ్ముతున్న ఓ లిక్కర్ షాపు యజమానికి అధికారులు జరిమానా విధించి షాక్ ఇచ్చారు. 

 

సిరిసిల్ల జిల్లాలోని ఓ మద్యం షాపు వద్ద మందుబాబులు పెద్ద ఎత్తున చేరి లిక్కర్ కొనుక్కెళ్తున్నారు. అధికారులు పరిశీలించేందుకు వెళ్లగా అక్కడ ఉన్న చాలా మందికి మాస్కులు లేవు. అయినా కూడా అమ్మకాలు జరుపుతుండటంతో సదరు యజమానికి రూ. 5 వేల జరిమానా విధించారు.  ప్రతి మద్యం షాపు యజమాని కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజలు కూడా విధిగా మాస్కులు ధరించిన తర్వాత రావాలన్నారు.  ఇదిలా ఉంటే.. నేటి నుంచి 29 వరకు తెలంగాణలో లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో తప్పని సరి మాస్క్ ధరించాలని.. లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: