ఒక పక్క కరోనా మహమ్మారి వల్ల ఎన్ని ప్రాణాలు పోతాయోనని అందరు భయంతో వణికిపోతున్నారు. బయటకు వెళితే చాలు ఎటువైపు నుంచి వైరస్ సోకి మరణిస్తామేమో అని ఎవ్వరు ఇంటిలోనుంచి బయటకు రావడం లేదు. పోలీసులు కూడా ఆంక్షలు పటిష్టం చేసారు. అందుకే లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. రోడ్లు అన్ని కాళీ అయ్యాయి. ఒక్క రవాణా చేసే వాహనాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.అయితే ఈ రవాణా వాహనాలు నడిపే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలయింది..

 

మరో ప్రాణం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మంగళగిరి సమీపంలో జరిగింది. రోడ్డు మీద జనం లేకపోయేసరికి ఇష్టానుసారంగా వాహనాలు నడిపి ఆక్సిడెంట్లు  చేస్తున్నారు.. తాజాగా గుంటూరులో ఒక ఘోర రోడ్డు ప్రమాద  ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే  తెల్లవారుజాము సమయంలో మంగళగిరి మండల పరిధిలోని కాజా టోల్‌ ప్లాజ్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడుతో వెళ్తున్న ఒక  ట్రక్కు ఆటోను, ఉల్లిపాయల లోడుతో ఉన్న  లారీ వెనక నుంచి వచ్చి  బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొన్న ధాటికి ఆటో పల్టీలు కొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు గాయాల పాలయ్యారు. లారి ఢీకొట్టడంతో ఆటో కూడా బాగా తుక్కు తుక్కు అయింది. ఆ ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మరణించాడు.

 

మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.ఆటోను లారీ బలంగా  ఢీకొట్టడంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా,  మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, దెబ్బలు తిన్న  క్షతగాత్రుడిని హుటాహుటిన  అంబులెన్స్‌లో గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.  అయితే  దెబ్బలు తిన్న అతని పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉంది. అయితే మరణించిన వ్యక్తి, గాయపడిన వ్యక్తి యొక్క  వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: