ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కుల రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా అని చాలామంది అంటారు. చాలా వరకు రాష్ట్రంలో వర్గాన్ని విడదీస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతూ చంద్రబాబు రాజకీయాలు చేస్తారని ప్రత్యర్ధులు మరియు సీనియర్ రాజకీయ నేతలు అంటుంటారు. కుల ప్రాతిపదిక పైన చంద్రబాబుకి పొలిటికల్ లెక్కలు ఉంటాయని కూడా చెబుతుంటారు. అటువంటి కుల రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఈ జన్మలో క్యాస్ట్ పాలిటిక్స్ చేయకుండా జగన్ తనదైన శైలిలో దెబ్బ కొట్టబోతున్నటు వైసీపీ పార్టీలో మరియు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే జిల్లాలపై జగన్ ఈ సందర్భంగా దృష్టిసారించినట్లు సమాచారం.

 

ముందుగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గత ఎన్నికల టైంలోనే ఆ ప్రాంతంలో వైసీపీ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడంతో ఉన్న పట్టు కోల్పోకుండా ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఆ ప్రాంతంలో ఇన్చార్జిగా నియమించడం జరిగింది. రాయలసీమలో ఎలాగో పార్టీ ముందు నుండి గట్టిగా ఉండటం తో ఈసారి జగన్ చూపు కోనసీమ పై పడింది. ముఖ్యంగా కోనసీమలో ఉభయ గోదావరి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు గట్టిగా ఉండటంతో ఆ ప్రాంతాలలో వైసిపి పార్టీ పట్టు సాధించడానికి అన్ని విధాలా కృషి చేస్తోంది.

 

పశ్చిమగోదావరి జిల్లాలో కమ్మ మరియు బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటంతో….ఆ వర్గాల లో ఉండే ప్రముఖులకు వైసీపీ పార్టీ తరఫున పదవులు ఇవ్వడానికి జగన్ రెడీ అయినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల కంటే ముందే రెండు గోదావరి జిల్లాలలో టీడీపీ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీ చేతిలో ఉండే విధంగా జగన్ భారీ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ దెబ్బతో ఒక వైపు ఉత్తరాంధ్ర మరోవైపు గోదావరి జిల్లాలో జగన్ పట్టు సాధిస్తే చంద్రబాబు రాజకీయాలు తిరుగులేని దెబ్బ కొట్టినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: