కేరళ మరి కొద్దీ రోజుల్లోనే కరోనా ఫ్రీ స్టేట్ గా మారనుంది. నిన్న జీరో కేసులు నమోదు కాగా ఈరోజు ఓ కరోనా కేసు నమోదయింది. తమిళనాడు నుండి కేరళ కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లువైద్యులు నిర్ధారించారు అలాగే ఈరోజు మరో 10 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో  ప్రస్తతం రాష్ట్రవ్యాప్తంగా 16కేసులు మాత్రమే యాక్టీవ్ గా ఉన్నాయని సీఎం విజయన్ వెల్లడించారు. ఈరోజుతో కేరళ లో మొదటి కరోనా కేసు నమోదై 100 రోజులు. ఆతరువాత కేసులు పెరుగుకుంటూ పోయిన కేరళ సర్కార్ తీసుకున్న కఠినమైన చర్యల వల్ల  ప్రస్తుతం పరిస్థితి చక్కబడింది. అంతేకాదు దేశంలోనే కరోనా కేసుల్లో హైయెస్ట్ రికవరీ రేట్ వున్న రాష్ట్రం గా కేరళ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 503 కేసులు నమోదు కాగా అందులో  484 మంది కోలుకోగా ముగ్గురు మరణించారు. 
 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక లో ఈరోజు మళ్ళీ కేసులు పెరిగాయి. ఈఒక్క రోజే అక్కడ 45 పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి అలాగే ఆంధ్రా లో కొత్తగా రోజు 54కేసులు నమోదుకాగా తెలంగాణ లో మరో 10కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడు లో మాత్రం అంతకంతకు కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. ఈరోజు కొత్తగా 600 కేసులు నమోదుగా అందులో ఒక్క చెన్నై లోనే 399 కేసులు బయటపడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: