చాలారోజుల తర్వాత లాక్ డౌన్ లో సడలింపులు రావడంతో ఏపీలో మద్యం అమ్మకాలు మొదలైన విషయం తెలిసిందే. అయితే 40 రోజులపైనే మద్యం బంద్ దొరకక ఇబ్బందులు పడిన మందుబాబులు ఒక్కసారిగా వైన్స్ దగ్గర ఎగబడిపోయారు. రేట్లు పెరిగినా, నచ్చిన బ్రాండ్లు దొరకక పోయినా సరే మందుబాబులు మందు తాగడం ఆపలేదు.

 

అయితే ఈ విధంగా కరోనా సమయంలో మద్యం అమ్మకాలు, రేట్లు పెరగడం, కొత్త బ్రాండ్లు రావడంపై టీడీపీ నేతలు విమర్సలు చేస్తున్నారు. ఇక వాటికి వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ ప్రభుత్వానికి ఊహించని సలహా ఒకటి ఇచ్చారు. లిక్కర్ కార్డు సిస్టమ్ ఒకటి పెట్టి, దాన్ని ఆధార కార్డుతో లింక్ చేయాలని చెప్పారు.

 

ఇక ఈ కార్డుతో ఒక్కొక్కరికి నెలకు ఒక్కో లీటర్ మద్యం ఇవ్వాలని, మూడు నెలల తర్వాత వారు మూడు లీటర్ల కంటే ఎక్కువ మద్యం కొంటే, వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేయాలని కోరారు. ముందే వారికి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, అలాగే డిమాండ్ ఎక్కువగా ఉన్నచోట ఆన్ లైన్ మద్యం అమ్మకాలు చేపట్టాలని, కౌన్సిలింగ్ విధానం తీసుకురావాలని, దీని వల్ల మద్యాన్ని పూర్తిగా అరికట్టలేకపోయిన, కొంచమైన రెగ్యులేషన్ చేయొచ్చని అంటున్నారు.

 

అయితే బుచ్చయ్య చెప్పిన ఐడియా బాగానే ఉంది కానీ ఇది వర్కౌట్ అవ్వడం అనేది చాలా కష్టం. ప్రభుత్వమే ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టాలి. కాకపోతే ప్రభుత్వం ఆ ఆలోచన చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ దశల వారీగా మద్యపాన నిషేధం దిశగా వెళుతుంది. అందులో భాగంగానే షాపులని కొన్ని తగ్గించి, మిగతా షాపులని ప్రభుత్వమే నడుపుతోంది. ఇక ధరల్ని కూడా పెంచితే మద్యం వినియోగం తగ్గుతుందని చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 100 శాతం వరకు మద్యం ధరలు పెంచారు. అయితే ధరలు నేత పెంచినా కూడా మందుబాబులు మందు తాగడం ఆపలేదు. మొత్తానికైతే ఎలా చేసినా.. ఏం చేసినా మందుబాబులు మాత్రం మందు తాగడం ఆపడం కష్టంలాగానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: