మోడీ అంటేనే మోజు. ఆయన మాట చెబితే చాలు వేదమే. ఇది 135 కోట్ల మంది భారతీయులంతా మోడీని అనుసరించే సూత్రం. మోడీ చెప్పారూ అంటే పాటించి తీరాల్సిందే. ఆయన మన మంచికోసమే చేస్తారు. ఆయన మన కోసం అన్నీ చెబుతారు. ఇదీ సగటు భారతీయుల నమ్మకం.


 
అందుకే మోడీ జనతా కర్ఫ్యూ పాటించమంటే అంతా ఒక్కటై పాటించారు. ఆ తరువాత చప్పట్లు కొట్టి తమ మద్దతు తెలిపారు. ఇక దీపాలు వెలిగించమంటే వెలిగించారు. ఇదే విధంగా లాక్ డౌన్ అని ఇంట్లో ఉండమంటే ఉంటున్నారు. పళ్ళ బిగువున అన్నీ భరించి లాక్ డౌన్ని విజయవంతం చేస్తున్నది ఈ దేశంలోని సగటి ప్రజానీకమే. 

 
సరే లాక్ డౌన్ మొదలయ్యే నాటికి 500  కరోనా కేసులు ఉన్న ఈ దేశంలో ఇపుడు అవి 50 వేలకు పై దాటాయి. రోజుకు కనీసంగా మూడు వేలకు తక్కువ కాకుండా కొత్త కేసులు వచ్చి చేరుతున్నాయి. అలాగ మరణాలూ పెరుగుతున్నాయి. లాక్ డౌన్ వల్ల కొంతవరకూ కట్టడి ఉన్నా అనుకున్న లక్ష్యం నెరవేరడంలేదన్నది ఆరోగ్య నిపుణుల మాటగా ఉంది.


 
అంతే కాదు, మరో వైపు చూసుకుంటే దేశంలో లాక్ డౌన్ కారణంగా పేదలు మరింత దిగజారిపోతున్నారు. ఆకలి కేకలు పెరిగిపోయాయి. దేశంలో వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అంతే కాదు, నిరుద్యోగం పెరిగిపోయింది. రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు దాంతో ఆర్ధిక వేత్తలు సైతం కూడా ఈ దేశం పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 
ఇంకోవైపు రాష్ట్రాలు కూడా కేంద్రం మీద కస్సుమంటున్నాయి. తమను ఆదుకోవాలని గట్టిగా కోరుతున్నాయి. అంతే కాదు, కనీసం అప్పులు చేసుకోవడానికైనా అవకాశం ఇవ్వమని అడుగుతున్నాయి. మరి దేనికీ పలకకుండా  మౌనంగా ఉన్న మోడీ మీద ఇపుడు కాంగ్రెస్ లాంటి పార్టీలు గట్టిగా నోరు చేసుకుంటున్నాయి.


 
నిన్న కాక మొన్న కేసీయార్ కేంద్రాన్ని ఓ లెక్కన తప్పుపట్టారు. కేంద్రం చేస్తున్నదేంటో అర్ధం కావడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు కాంగ్రెస్ వంతు వచ్చినట్లుంది. దేశంలో ఉన్న ప్రజల అసంత్రుప్తి, పెరుగుతున్న కరోనా కేసులను చూసిన మీదటన కాంగ్రెస్ పెద్ద నోరు చేస్తోంది. గుజరాత్ కి చెందిన కాంగ్రెస్ నేతలు కరోనా వైరస్ దేశంలో పెరగడానికి మోడీ కారణమని దుయ్యబెడుతున్నారు.


 
నమస్తే ట్రంప్ పేరిట కార్యక్రమం పెద్ద ఎత్తున ఫిబ్రవరి 24న గుజరాత్ లో పెట్టి లక్షల మందిని తీసుకువచ్చి నాడే ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ ని దేశంలోకి ఎక్కువ అయ్యేలా చేశారని అంటున్నారు. మరి ముందు ముందు లాక్ డౌన్ తరువాత దేశంలో దిగజారిన పరిస్థితులను  చూసుకుని  మోడీ మీద దాడికి విపక్షాలు రెడీ అయిపోతాయని  అర్ధమవుతోంది. మరి దీన్ని ఎలా మోడీ కాచుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: