దాయాది దేశం పాకిస్తాన్ లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. శ‌నివారం నుంచి పాకిస్థాన్‌లో ద‌శ‌ల వారీగా  లాక్‌డౌన్‌ను తొల‌గిస్తున్న‌ట్లుగా ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్ల‌డించారు. దేశంలోని కోట్లాది మంది పేద‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు.. రోజూ వారీ కూలీలు లాక్ డౌన్ కారణంగా క‌ష్టాలు ఎదుర్కొంటున్నారు... వారి కోసమే లాక్‌డౌన్ స‌డ‌లిస్తూ నిర్ణ‌యం తీసు కుంటున్నామ‌ని ఇమ్రాన్‌ఖాన్ త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి పాకిస్తాన్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  వైరస్ కట్టడిలో భాగంగా లాక్ డౌన్‌ను మరింత కఠినం చేయాల్సి ఉండ‌గా ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌డంపై ఆదేశంలోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

 ఇలా లాక్ డౌన్ ఎత్తివేయడం సరైన నిర్ణయం కాదని తెలుసనీ.. కానీ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తోందని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోయింద‌ని అన్నారు. అయితే పేదవారి కోసం ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించిన‌ట్లు గుర్తు చేశారు. ఇదిలా ఉండ‌గా గడిచిన 24 నాలుగు గంటల్లో పాకిస్తాన్‌లో కొత్తగా మరో 1,430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా లెక్కల ప్రకారం.పాకిస్తాన్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24,644కి చేరింది. ప‌రీక్ష‌లు త‌క్కువ‌గా జ‌రుగుతుండ‌టంతో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెల్ల‌డికావ‌డం లేద‌ని అక్క‌డి ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

లాక్‌డౌన్ క్ర‌మంగా ఎత్తివేసినా  ప్రజలు  స్వీయ నియంత్రణ పాటిస్తూ.. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. షాపులన్నీ వారంలో ఐదు రోజులు పాటు సాయంత్రం 5 గంటల వరకు తెరిచే ఉంటాయని తెలిపారు. అయితే ప్ర‌జార‌వాణాకు మాత్రం ఇప్ప‌ట్లో అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని తెలిపారు.  మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించే వారికి శిక్ష‌లు అమ‌లు చేయ‌డానికి కూడా వెనుకాడ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా పాక్‌లోని సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: