తెలంగాణకు వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాప్తి ప్రమాదం పొంచి ఉందా ?, అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది . కేంద్రం... లాక్ డౌన్ ఆంక్షలు సడలించి , వలస కార్మికులు స్వస్థలాలకు  వెళ్లేందుకు అనుమతించింది . దీనితో బతుకు దెరువుకోసం తెలంగాణ నుంచి  ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన వలస కార్మికుల  ఇంటి బాట పట్టారు . తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది జీవనోపాధికోసం ముంబాయి కి  వలస వెళ్లారు . మహారాష్ట్ర లో కరోనా విస్ర్తుతంగా వ్యాప్తి  చెందడం తో , ముంబాయి నుంచి స్వస్థలాలకు  చేరుకుంటున్న వారి వైపు అనుమానపు చూపులు మొదలయ్యాయి .
 
 
దానికితోడు ముంబాయి నుంచి  సంస్థాన్ నారాయణపూర్ మండల పరిధి లోని  జనగాం కు వెళ్తోన్న ముగ్గురు వలస కార్మికులను పరిక్షించగా, వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం తో ,  ఐసోలేషన్ కు తరలించారు . ఒక్క ముంబాయి కే , కాకుండా గుజరాత్ నుంచి వచ్చే వలస కూలీలకు కూడా  కరోనా ప్రమాదం పొంచి  ఉండే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి . అయితే ముంబాయి , గుజరాత్  నుంచి స్వస్థలాలకు వచ్చిన వలస కూలీలను గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది .
 
వలస కూలీలు ఎవరైనా తమ గ్రామానికి వచ్చినట్లయితే , స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు  ఉన్నతాధికారులు కోరారు . ఇక  ఇతర  రాష్ర్టాల  నుంచి  వచ్చే వలస కూలీలను  రాష్ట్ర సరిహద్దుల్లోని కరోనా పరీక్షలు నిర్వహించి రాష్ర్టంలోని వారి  స్వస్థలాలకు అనుమతించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు . 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: