40 రోజుల సంక్లిష్టమైన లాక్ డౌన్ సమయం తర్వాత మద్యం షాపులు తెరవడంతో మందుబాబులు అంతా గత నాలుగు రోజుల నుండి పండగ చేసుకుంటున్నారు. రోజుకి వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం తెచ్చి పెడుతూ వారు కూడా మత్తులో మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

 

అయితే తమిళనాడు మద్యం ప్రియులకు మరియు రాష్ట్ర సర్కార్ కి మద్రాస్ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనగా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ నిర్వహించే అన్నీ మద్యం దుకాణాలను మూసి వేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే మద్యాన్ని ఆన్ లైన్ లో విక్రయించి డోర్ డెలివరీ సౌకర్యం కల్పించవచ్చని స్పష్టం చేయగా హై కోర్టు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద షాక్ కు గురి చేసింది. ఇన్ని రోజుల లాక్ డౌన్ వల్ల కలిగిన ఆర్ధిక నష్టం అంతా ఒక్క నెల రోజుల్లో కవర్ చేద్దామనుకున్న వారి ఆశలకు హైకోర్టు గండి కొట్టింది.

 

ఇక వివరాల్లోకి వెళితే మద్యం దుకాణాల దగ్గర సామాజిక దూరం పాటించడంలేదని ప్రముఖ సినీ నటుడు మరియు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తో సహా పలువురు న్యాయవాదులు మరియు పౌరులు హై కోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.

 

ఇకపోతే మే 4 తేదీన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరొక మూడు రోజులలోనే మద్యం విక్రయాలు మొదలు పెడతాము అని ప్రకటించిన తరువాత అది చాలా వివాదాస్పదమైంది. రోజుకు 300 నుంచి 500 కేసులు నమోదు అవుతుంటే మీకు మద్య అమ్మకాలు కావలసి వచ్చిందా అంటూ చాలా మంది హై కోర్టుకు వెళ్లగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పై హైకోర్టు స్టే కూడా విధించింది.

 

ఇక మే 7 మద్యం అమ్మకాలు జరిగిన చోట మద్యం షాపుల వద్ద హై కోర్టు విధించిన నిబంధనలను ఎవ్వరూ పాటించడం లేదని, ఫలితంగా భౌతిక దూరం పాటించాలనే లక్ష్యం కూడా దెబ్బ తింటోందని మరోసారి పలువురు హై కోర్టు మెట్లెక్కారు. పిటిషన్లను విచారణకు స్వీకరించిన హై కోర్టు.. ఈసారి మద్యం దుకాణాలు మూసేయాల్సింగా ఆదేశిస్తూ.. ఆన్‌లైన్‌లో విక్రయించుకోవాల్సిందిగా సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: