ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా తాకిడి అస్సలు తగ్గట్లేదు. టెస్టుల సంఖ్య పెరగడంతో రోజుకి కనీసం యాభై పైన కేసులు నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా మ‌రో 54 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరింది. మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉద‌యం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

 

గ‌డిచిన‌ 24 గంటల్లో 7,320 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 54 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. అత్య‌ధికంగా అనంతపురం జిల్లాలో 16, విశాఖ జిల్లాలో 11 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా అన్ని కేసులు ఒకేరోజు నమోదు కావడం గత కొన్ని వారాల్లో ఇదే తొలిసారి. కర్నూలు, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లోనే ఇన్ని రోజులు రోజుకి ఎక్కువ కేసులు నమోదు అయ్యేవి.

 

ఇకపోతేచిత్తూరు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కరోనా కేసులు వ‌చ్చాయి. అలాగే కొత్త‌గా ముగ్గురు మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మృతుల సంఖ్య 41కి చేరిందితాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1887 కాగా.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 1004గా ఉన్నాయి. ఇదిలా ఉంటే విశాఖ పట్నంలో తొలి మరణం నమోదైంది

మరింత సమాచారం తెలుసుకోండి: