ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో మావోయిస్టులు, జవాన్లకు మధ్య శుక్ర‌వారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఎస్సై మృతి చెందగా, నలుగురు మావోయిస్టులు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. మావోలు స‌మావేశం ఏర్పాటు చేసుకున్న‌ట్లుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజనందగావ్ జిల్లాలోని మదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్యామ్ కిషోర్ శర్మ నేతృతత్వంలో పోలీస్ పార్టీ శుక్రవారం రాత్రి  కూంబింగ్ కి వెళ్లారు. అయితే అప్ప‌టికే పోలీసుల రాక‌కు సంబంధించిన స‌మాచారం అంద‌డంతో మావోయిస్టులు మాటు వేసి వారిపై కాల్పులకు దిగారు. పోలీసులు కూడా  మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. 

 

దాదాపు మూడున్న‌ర గంట‌ల పాటు సాగిన ఈ కాల్పుల్లో సుమారు నలుగురు మావోయిస్టులతో పాటు,  ఎస్సై శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.   ఎస్పీ జితేంద్ర శుక్ల సంఘటనా స్థలానికి బ‌య‌ల్దేరి వెళ్లారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మావోలు వ‌దిలి వెళ్లిన ఏకే-47 రైఫిళ్ల‌ను భారీగా స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. సంఘటనా ప్రాంతం నుంచి మావోయిస్టుల సాహిత్యం, ఐఇడి బాంబులు, ఎలక్ట్రానిక్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా కొంత‌కాలంగా రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో  మావోల క‌ద‌లిక‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్న నేప‌థ్యంలో పోలీసులు ప్ర‌త్యేక పోలీస్ టీంల‌తో కూంబింగ్ చేప‌డుతున్నారు. 

 

గ‌డిచిన కొద్ది నెల‌ల్లో ఏజెన్సీలో తుపాకుల మోత విన‌బ‌డుతూనే ఉంది. జిల్లా, రాష్ట్ర, ఐటిబిపి పోలీసు బలగాలు సంయుక్తంగా అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలీసుల వ‌రుస కూంబింగ్‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోలు...కొత్త షెల్ట‌ర్ల‌ను వెతుక్కునే ప‌నిలో నిమ‌గ్న‌మ్యారు. అందులో భాగంగానే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోకి కూడా అడుగుపెట్టేందుకు య‌త్నించిన‌ట్లు ఆమ‌ధ్య‌లో వార్త‌లు వ‌చ్చాయి. భ‌ద్రాద్రికొత్త‌గూడెం, ఏటూరునాగారం, మంగ‌పేట ప్రాంతాల్లోని గోదావ‌రి ప‌రివాహాక ప్రాంతం గుండా మావోలు తెలంగాణ‌లోకి అడుగుపెట్టార‌ని వార్త‌లు రావ‌డంతో డీజీపీ కూడా స్వ‌యంగా జిల్లాల్లోప‌ర్య‌టించ‌డం గ‌మ‌నార్హం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: