దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తోంది  అన్న విషయం తెలిసిందే. రోజురోజుకు విజృంభిస్తున్న ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగి పోతూ ఉండడంతో పాటు ఈ వైరస్ మరణాల రేటు కూడా భారీగా పెరిగి పోతుంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో అయితే మరణాల రేటు అత్యధికంగా ఉంది అనే చెప్పాలి. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ కరోనా  మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ మరణాల రేటు మాత్రం ఎక్కువగా ఉంది అంటున్నారు. 

 

 

1548 కరుణ పాజిటివ్ కేసులు నమోదు కాగా... 151 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కరోనా  మరణాల సంఖ్య తక్కువగా చూపుతోందని ఆరోపణలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే కరోనా  వైరస్ కారణంగా పశ్చిమబెంగాల్ లో మరణించింది కేవలం 79 మంది మాత్రమేనని మిగితా వారు మాత్రం ఇతర జబ్బులతో మరణించారు అని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో రోజుకు 4400 పరీక్షలు చేపట్టగా ప్రస్తుతం రెండు వేల ఐదు వందలు చొప్పున పరీక్షలు జరుగుతున్నాయి. 

 

 

మొత్తం మీద ఇప్పటి వరకు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కేవలం 30 వేల కరోనా  నిర్ధారిత పరీక్షలు మాత్రమే జరిగినట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే పశ్చిమ బెంగాల్లోని కేవలం నగరాలలో మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అయితే చాలామంది పశ్చిమబెంగాల్లోని నగరాల్లో సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లే ఈ కరోనా  వైరస్ ని ఎదుర్కోవడం మరింత క్లిష్టంగా మారింది అంటున్నారు వైద్య నిపుణులు. అయితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరణాల రేటు ఎక్కువగా ఉండడానికి కారణం సామాజిక దూరం పాటించకుండా ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడమే అంటున్నారు.  అంతేకాకుండా ఆ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో పరీక్షలు జరగడమే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: