ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైజాగ్ స్టెరీన్ గ్యాస్ ప్ర‌మాద బాధితుల‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నారు. కేవ‌లం 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌కుండానే జ‌గ‌న్ ప్ర‌మాద బాధితుల‌కు ఇచ్చిన ప‌రిహారం రిలీజ్ చేశారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రు. కోటి ప‌రిహారం రిలీజ్ చేశారు. ఇక చికిత్స పొందుతోన్న వారికి, బాధిత గ్రామాల ప్ర‌జ‌ల‌కు, ఈ ప్ర‌మాదంలో ప‌శువులు కోల్పోయిన వారికి సైతం ప‌రిహారం రిలీజ్ అయ్యింది. ఇక రైతులు పంట‌లు న‌ష్ట పోవ‌డంతో వారిని సైతం త‌క్ష‌ణ‌మే ఆదుకోవాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేయ‌డంతో పాటు వీరికి కూడా ప‌రిహారం రిలీజ్ చేశారు.

 

ఇక జ‌గ‌న్ ఇంత స్పీడ్ గా డెసిష‌న్ తీసుకోవడంతో పాటు ప‌రిహారం సైతం రిలీజ్ చేయ‌డంతో దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు అంద‌రూ జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సైతం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక జ‌గ‌న్ గ్యాస్ ప్ర‌మాద బాధితుల‌ను ప‌రామ‌ర్శిం చేందుకు వైజాగ్ వెళ్లి బాధితుల‌కు భారీ ప‌రిహారం ప్ర‌క‌టించారు. ఇక అక్క‌డ త‌క్ష‌ణ ప‌రిహారంగా చికిత్స పొందుతోన్న బాధితులు, ఇత‌ర‌త్రా అవ‌స‌రాల కోసం జ‌గ‌న్ ఏకంగా రు. 30 కోట్లు రిలీజ్ చేశారు.

 

దీంతో స్థానిక అధికారులు షాక్ అయిపోయారు. అంతెందుకు మామూలుగా ఏదైనా విష‌యం జ‌రిగితేనే పెద్ద ర‌చ్చ ర‌చ్చ చేసే ఏపీ ప్ర‌తిప‌క్షాలు ఈ విష‌యంపై ఏ మాత్రం చిన్న విమ‌ర్శ కూడా చేయ‌కుండా జ‌గ‌న్‌ను ప్ర‌శంసించాయి. క‌మ్యూనిస్టు పార్టీలు సైతం జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశాయి. ఇక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సైతం జ‌గ‌న్‌కు ముందుగా ఫోన్ చేసి ప్ర‌మాద వివ‌రాలు తెలుసుకోవ‌డంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వం సాయం చేస్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు.

 

అయితే ఆ త‌ర్వాత జ‌గ‌న్ త‌క్ష‌ణ సాయ‌మే రు. 30 కోట్లు ప్ర‌క‌టించాడ‌ని తెలియ‌డంతో పాటు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన భారీ ప‌రిహారం చూసి అవాక్కై పోయాడ‌ని ఢిల్లీ వ‌ర్గాల క‌థ‌నం. ఏదేమైనా ఈ ప్ర‌మాదం విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ వేగంగా తీసుకున్న‌ చ‌ర్య‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: