కౄరత్వానికి కేరాఫ్ అడ్రాస్‌గా మనిషి రోజు రోజుకి మారిపోతున్నాడు.. మంచి చెడులకు మధ్య ఉన్న తారతమ్యాలను మరచి ప్రవర్తిస్తున్నాడు.. తాను చేసే ఘోరాలను తానే సమర్ధించుకుంటూ తన పతనానికి తానే మూలకారణం అవుతున్నాడు.. తన రాక్షస యజ్ఞంలో సమిధలుగా తన వారినే బలి ఇస్తున్నాడు.. కుటుంబ విలువలు మరచి.. వావివరసలంటే అక్కరకు రాని చెత్తలా భావిస్తూ కన్ను మిన్ను కానరాక.. కన్నవారి, తోడబుట్టిన వారి పాలిట యముడిలా మారుతున్నారు.. నిజంగా మానవ జన్మ అంత దరిద్రమైన జన్మ లేదని, మనుషులంటే, రాక్షాసులకంటే హీనమని నిరూపించుకుంటున్నారు..

 

 

ఇకపోతే ఇలాంటి పిల్లలను కనడమే తల్లిదండ్రులు చేసిన తప్పా.. తాము కన్నవారు భవిష్యత్తులో సమాజానికి ప్రమాదకరంగా మారుతారనుకుంటే చిన్నప్పుడే పురిట్లోనే చంపడం మేలు.. కానీ భగవంతుడు ఆ అవకాశం మానవులకు ఇవ్వలేదు.. ఇక ఇక్కడ అన్న అని చెప్పుకునే మానవ మృగం సొంత చెల్లినే అతి కిరాతకంగా చంపాడు.. ఆ వివరాలు చూస్తే.. చెన్నై.. విరుదునగర్‌ జిల్లా శీర్గాళి సమీపం కీళక్కడైమంగలత్తై గ్రామానికి చెందిన చంద్రమతికి కుమారుడు గణేష్‌బాబు(23), ముగ్గురు కుమార్తెలున్నారు.

 

 

వారిలో మొదటి కుమార్తే పేరు హంసవల్లి(20).. కాగా హంసవల్లి, నర్సింగ్‌ రెండో సంవత్సరం రాజపాళయంలోని కళాశాలలో  చదువుతోంది. ఈ నేపధ్యంలో ఒక యువకుడిని ఆమె ప్రేమిస్తుందని తెలిసి గణేష్‌బాబు హంసవల్లితో గొడవ పెట్టుకున్నాడు.. అంతటితో ఊరుకోకుండా బయటకు వెళ్లి ఫుల్‌గా మద్యం తాగి సాయంత్రం ఇంటికి వచ్చి తన చెల్లెలితో మరింత గొడవకు దిగాడు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయిన గణేష్ కట్టెతో చెల్లెలుపై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో హంసవల్లి అక్కడికక్కడే మృతి చెందింది..

 

 

ఈ విషయాన్ని గమనించి గణేష్‌  భయంతో పరారయ్యాడు. ఇక ఈ దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి నిందితుడి కోసం వెతుకులాట ప్రారంభించారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: