దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి గురించి మాటలు నడుస్తున్నాయి.  వాస్తవానికి ఈ కరోనా లక్షణాలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నా ఆ ప్రభావం మాత్రం చైనాలోని పుహాన్ లో ఎక్కువ పుట్టుకొచ్చొంది.  కరోనా వైరస్ పుహాన్ లో పుట్టుకొచ్చినా.. ఇప్పుడు ప్రపంచం అంతా విలయతాండం చేస్తుంది. 2019 డిసెంబర్ నెలలో చైనా  వుహాన్ మార్కెట్ నుంచి ప్రారంభమైన ఈ  కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని అతలాకుతులం చేస్తోంది. ఆర్ధిక వ్యవస్థ  చిన్నాభిన్నమైంది. కోట్లాది మంది తమ ఉద్యోగాల్ని పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. అంతటి విలయతాండవం చేస్తున్న కరోనా  గుజరాత్ కు 2015లోనే వచ్చింది. అదేంటీ ఇప్పుడు ఉన్న కోరోనా 2015 రావడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? 2015 గుజరాత్ లో  కరోనా పేరుతో  ఓ హోటల్ ప్రారంభమైంది.

 

ప్రస్తుతం ఆ హోటల్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన బనస్కాంత  హైవే పక్కన 2015లో ఈ హోటల్ ను ప్రారంభించారు. అప్పట్లో ఈ హోటల్ మూడు పువ్వులు ఆరుకాయల్లా రన్నింగ్ అయ్యిందట. గుజరాత్‌ సిద్ధా పూర్ కు చెందిన బర్కత్ 2015లో ఈ హోటల్ ను ప్రారంభించారు. కొత్తగా ప్రారంభిస్తున్న తన  హోటల్ కు ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా కరోనా అనే పేరు స్ట్రైక్ అయినట్లు చెప్పాడు. కరోనా అంటే అర్ధం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.  

 

ఉర్దూలో గెలాక్సీ అని అర్ధం. దీంతో పేరు బాగుందని  ఆ హోటల్ కు కరోనా అని నామకరణం చేసినట్లు ..యజమాని బర్కత్ చెప్పాడు. కానీ ఈ కరోనా వల్ల ఇంత దారుణాలు ఉంటాయని ఆయన అప్పట్లో ఊహించలేదు. కరోనా ఇంతటి ప్రళయం సృష్టించడంపై ఆందోళన వ్యక్తం చేసిన బర్కత్..తన హోటల్ కు 2015లో కరోనా అని పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: