ప్రస్తుతం ప్రపంచం కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి యాంటీ డోస్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి దేశం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వీటిపై పరిశోధనలకు శాస్త్రవేత్తలు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఒక వేళ ఇది ప్రయత్నించి ఫలించిన ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం సంవత్సరం పైగా పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ఒకలా ఉంటే భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఒక వ్యక్తి తాను కరోనా వైరస్ కు మందు కనిపెట్టాను అని ప్రచారం చేసుకుంటున్నాడు. అది వాడటం వల్ల కేవలం 48 గంటల్లో కరోనా పేషెంట్ మామూలు వ్యక్తి అవుతాడు అని తను చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు అతన్ని విచారించి అరెస్ట్ చేసిన సంగతి జరిగింది. ఇక పూర్తి వివరాలు ఒకసారి చూస్తే....

 


తమిళనాడు రాష్ట్రంలోని కొయామ్‌బేడుకు చెందిన తనికశాలమ్‌ అనే వ్యక్తి ఆయుర్వేదిక్ డాక్టర్ గా పరిచయం చేసుకుంటున్నాడు. అతను కరోనాకు ఆయుర్వేదిక్ మందు కనిపెట్టాడు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నాడు. దానితో కేవలం కరోనా దూరం చేయడానికి 48 గంటల్లో వారికి వ్యాధి నయం అవుతుందని డాక్టర్లకు సవాల్ విసిరాడు. లండన్ లో కరోనా బారిన పడిన ఒక వ్యక్తి కాపాడడానికి నేను పంపించిన ఆయుర్వేదిక్ మందు పనిచేసిందని చెప్పుకొచ్చాడు.

 


అయితే సదరు ఆయుర్వేదిక్ వైద్యులు విషయం ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి అధికారుల దృష్టికి వెళ్లింది. దానితో అనుమానం వచ్చిన వారు పోలీసులకు ఆ వివరాలను అందించి అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి అది నిజం కాదని తేల్చేశారు. దీనితో అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి అర్హత లేకుండా ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా నడుపుతున్నట్లు ఇందులో తేలింది. అయితే ఆయన పెద్దగా చదువు లేకుండానే అనేక వైద్య విధానాలు కనుగొన్నానని ఔషధం కనిపెట్టడానికి చదువుకు సంబంధం లేదని చెబుతుండడం గమనించాల్సిన విషయం. అయితే దీనికి తప్పుడు ప్రచారం చేస్తున్న సందర్భంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ కింద యాక్ట్ 54 కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు చేపట్టి రెగ్యులేషన్ చట్టం ప్రకారం అది నేరమని పోలీసులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: