ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్  డౌన్  సడలింపులు లో భాగంగా మద్యం అమ్మకాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో దాదాపు గత 40 రోజుల నుండి మద్యం కోసం నిరీక్షణ గా ఎదురు చూసిన మందుబాబులు అందరూ ప్రస్తుతం మద్యం షాపుల వద్ద బారులు తీరుతూ కొనుగోలు చేస్తున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాలలో ప్రస్తుతం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్రంలో మే 7వ తేదీ నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇక మొదటి రోజు నుంచే మందుబాబులు అందరూ మద్యం షాపుల వద్ద బారులు తీరుతూ పెద్ద క్యూ కడుతున్నారు. 

 

 

 అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మందుబాబులు అందరూ మద్యం షాపులు పూర్తిస్థాయిలో తెరుచుకుంటే బాగుండు అని ఆశ పడుతూ ఉంటే.. కొంతమంది మాత్రం మద్యం షాపులు తెరుచుకోకపోవడమే మంచిది అని అనుకుంటున్నారు. దాదాపుగా 40 రోజులపాటు మద్యానికి దూరంగా ఉండగా...  మద్యం తాగేవారిలో సైతం మార్పులు వచ్చాయని అలాంటి వారికి మళ్లీ మద్యం అలవాటు అయితే జీవితాలు మళ్లీ దుర్భరంగా మారిపోతాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం అమ్మకాలు జరగకపోవడమే మంచిది అంటున్నారు. 

 

 

 ఈ నేపథ్యంలో  కొన్ని గ్రామాలలో మద్యం అమ్మకాలను జరపకూడదు అంటూ ఏకంగా తీర్మానాలు కూడా చేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే జరిగింది కరీంనగర్లోని కాట్రవల్లి పంచాయతీ పరిధిలో. గ్రామ పెద్దలు అందరూ కలిసి తమ గ్రామ పంచాయతీ పరిధిలో మద్యాన్ని నిషేధించారు. ఇక పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే వారికి ఏకంగా పది వేల రూపాయల జరిమానాతో పాటు సంక్షేమ పథకాలు అన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇలా నిబంధనలు అతిక్రమించిన వారికి నల్ల కలెక్షన్ కూడా తొలగిస్తాము  అంటూ తెలిపారు. దీంతో గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని ఊరంతా ఒక మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: