ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది పేదలు ఆకలితో అలమటించిపోతున్నారు.  అయితే కరోనా మహమ్మారి ప్రభావం మనదేశంలో కూడా తీవ్రంగా చూపిస్తుంది. ఎంతో మంది దిగువ, మద్యతరగతి ప్రజలకు కష్టాలు పడుతున్నారు. ఇక వలస కూలీల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయిన విషయం తెలిసిందే. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు చేస్తున్నారు.  కానీ అన్నార్తుల ఆకలి బాధలు మాత్రం పూర్తి స్థాయిలో తీర్చలేకపోతున్నాయి. ఇందుకు కారణం కొన్ని చోట్ల వలస కూలీలు తిరగబడుతున్న ఘటనలే సాక్ష్యం. ఓ వైపు ఉపాధి లేక.. సొంత ఊరికి వెళ్లలేక ఎంతో మంది వలస కూలీలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో ఓ మహిళ తీరని వేదనను అనుభవించింది.

 

బిడ్డను చంకన వేసుకొని తిరుగుతూ ఆమె కష్టాన్ని చూసి ఎవరైనా అయ్యో అంటారు.  తన 6 నెలల బిడ్డను చంకలో వేసుకొని మండుటెండలో బియ్యం కోసం ఏకంగా 13 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. బనియాపుకుర్ గ్రామానికి చెందిన మార్గరెట్ హన్స్‌దా భర్త బెంగుళూరులో కూలీ పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా పనిలేక డబ్బుల పంపలేదు. ఇంటికి వచ్చే అవకాశం కూడా లేదు. ఒంటరిగా ఉన్న భార్య తన మూడున్నరేళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకు, మరో 6 నెలల బిడ్డకు భోజనం పెట్టలేక ఎన్నో ఇబ్బందులు పడింది. ఈ సమయంలో రేషన్ ఇస్తున్నారనే విషయం తెలియడంతో శిశువును చంకలో వేసుకొని నడుచుకుంటూ వెళ్లింది.

 

 అయితే ఆమెకు రేషన్ లేకపోవడం చూసి ఆ తల్లిపడుతున్న ఆవేదన గ్రహించిన అధికారులు చలించిపోయారు. వెంటనే సంబంధిత అధికారి హర్ధన్ దేవ్ ఆమెకు రేషన్ కిట్ అందించారు.తన బిడ్డల కడుపు నింపడం కోసం తాను ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోందని ఆ మహిళ ఆవేదన చెందిన తీరు స్థానికులను కలిచివేసింది. ఆ మద్య ఓ తల్లి తన పిల్లల కోసం గంటల తరబడి ఆహారం కోసం ఎదురు చూసి మొత్తానికి కన్నబిడ్డల ఆకలి తీర్చి తాను పస్తులున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: