తాను ఒక‌టి త‌లిస్తే.. జ‌రిగింది మ‌రొక‌టి అన్న‌ట్టుగా ఉంది.. ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి. రాష్ట్రంలో మ‌ద్యం అ ల‌వాటు కార‌ణంగా.. అనేక కుటుంబాలు క‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ విష‌యాన్ని త‌న పాద ‌యాత్ర ద్వారా గుర్తించిన జ‌గ‌న్‌.. ఈ నేప‌థ్యంలోనే త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వ‌చ్చాక‌.. ఎట్టి ప‌రిస్థితిలోనూ రాష్ట్ర నిషేధాన్ని విడ‌త‌ల వారీగా అమ‌లు చేస్తాన‌ని హామీ ఇచ్చా రు. మ‌ద్యం అల‌వాటును త‌గ్గించే క్ర‌మంలో ధ‌ర‌ల‌ను పెంచుతాన‌ని ఎన్నిక‌ల‌కు ముందుగానే ప్ర‌క‌టించారు. ఈ మాట ప్ర‌కార‌మే జ‌గ‌న్ అధికారంంలోకి వ‌చ్చిన వెంట‌నే.. రాష్ట్రంలో మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేయ‌డం ప్రారంభించారు.

 

అయితే, రాష్ట్రంలో ఒకే సారి కాకుండా.. విడ‌త‌ల వారీగా మ‌ద్య నియంత్ర‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో ప్రైవేటు వ్య‌క్తులతో న‌డుస్తున్న వైన్ దుకాణాల‌ను ప్ర‌భుత్వ‌మే స్వాధీనం చేసుకుంది. ఈ క్ర మంలోనే రాష్ట్రంలోని వైన్స్ దుకాణాల సంఖ్య‌ను 20 శాతం త‌గ్గించారు. ఫ‌లితంగా మ‌ద్యం దుకాణాల సంఖ్య క్ర‌మంగా త‌గ్గిపోయింది ఇది మ‌ద్య నిషేధంపై ప్ర‌భావం చూపుతుంద‌ని , మ‌ద్యం ప్రియుల‌ను దూరం చేస్తుంద‌ని జ‌గ‌న్ భావించారు. అదేస‌మ‌యంలో మ‌ద్యం ధ‌ర‌ల‌ను కూడా భారీగా పెంచారు. ఇది కూడా మ‌ద్య నిషేధం అమ‌లులో భాగంగానే జ‌గ‌న్ భావించారు.

 

ఇక‌, లాక్‌డౌన్ నేప‌థ్యంలో దాదాపు 40 రోజులు మ‌ద్యం దుకాణాలు మూత‌బ‌డ్డాయి. కానీ, ప్ర‌స్తుతం లాక్‌డౌ న్ మూడో ద‌శ జ‌రుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌బుత్వ‌మే.. మ‌ద్యం దుకాణాలు తెరుచుకునేందుకు అవ కాశం ఏర్ప‌డేలా చేసింది. దీంతో ఏపీలోనూ మ‌ద్యం దుకాణాలు తెరిచారు. అయితే, మ‌ద్యం నియంత్రణ ‌లో భాగంగా షాపుల సంఖ్య‌ను త‌గ్గించ‌డంతోపాటు.. ధ‌ర‌ల‌ను ఏకంగా 75శాతం పెంచేశారు. 

 

ఇది మ‌ద్యం వినియోగాన్ని త‌గ్గిస్తుంద‌నేది జ‌గ‌న్ స‌హా ప్ర‌భుత్వం వేసుకున్న అంచ‌నా. అయితే, దీనికి భిన్నంగా మ‌ద్యం ప్రియులు మాత్రం త‌మ అలవాటుకు దూరంకాలేదు. మోతాదు త‌గ్గించినా.. మందుకు మాత్రం దూరం కాలేదు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్న మ‌హిళ‌లు.. జ‌గ‌న‌న్నా.. నువ్వు తీసుకున్న నిర్ణ‌యం బాలేదంటూ.. వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మరి జ‌గ‌న్ ఎలాంటి ప‌రిష్కారం చూపిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: