క‌రోనా వ‌చ్చింది.. లాక్‌డౌన్ తెచ్చింది. దీంతో దేశ‌వ్యాప్తంగా అన్ని వ్య‌వ‌స్థ‌లూ కూడా బంద్ అయ్యాయి. అది ఇది అనే తేడా లేకుండా ప‌రిశ్ర‌మల నుంచి సాధార‌ణ వ్య‌వ‌హారాల వ‌ర‌కు కూడా నిలిచిపోయాయి. అదేసమ ‌య‌లో విద్యారంగం కూడా మూత‌బ‌డింది. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన ప‌రీక్ష‌ల‌ను సైతం ప్ర‌భుత్వా లు, కోర్టులు కూడా వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు. ఇలా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నూ వాయిదా ప‌డ్డాయి. అయితే, ఈ వాయిదా నానాటికీ పెరుగుతుండ‌డంతో విద్యార్థులు ఆందోళ‌న చెందు తున్నారు.

 

ఏపీలోనూ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థు లు మాన‌సికంగా ఆవేద‌న చెందుతున్నారు.  మ‌రో నెలలో కొత్త విద్యాసంవ త్స‌రం ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ప‌రిస్థితి ఏంట‌ని త‌ల ప‌ట్టుకుంటున్నారు.  దీంతో స్పందించిన  కేంద్రం పరిధిలోని సీబీఎస్ఈ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశాయి. పదో తరగ తి పరీక్షలు మాత్రం నిర్వహిస్తామంటున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఢిల్లీకి అత్యంత చేరువ‌లో ఉండే.. పంజాబ్ ప్ర‌భు త్వం కీల‌క‌నిర్ణ‌యం తీసుకుంది.

 

ఇక్క‌డ కేవ‌లం 1 నుంచి 9 త‌ర‌గ‌తులే కాకుండా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను కూడా ప్ర‌మోట్ చేయ‌నున్న‌ట్టు పేర్కొంది. ఇది నిజంగా సంచ‌ల‌న నిర్ణ‌య‌మే అవుతుంద‌ని అంటున్నారు విద్యారంగ నిపుణులు. అయితే, ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పాల్సి ఉంది. క్లారిటీ వ‌స్తే.. పంజాబ్ నిర్ణ‌యం మేర‌కు ఏపీ స‌హా అన్ని రాష్ట్రాలు న‌డ‌వ‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏపీలో ఈ నిర్ణ‌యం తీసుకుంటే.. దాదాపు ఐదు ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు ఎలాంటి ప‌రీక్ష లేకుండా ప్ర‌మోట్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: