మొన్నటి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్  నిబంధనలు అమలు అయిన విషయం తెలిసిందే.  దుకాణ సముదాయాలు మూసి వేయడంతో పాటు ప్రజలు ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. ఎక్కడ గడపదాటి అడుగు బయట పెట్టకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు  . అయితే దాదాపు 40 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ  వ్యాప్తంగా లాక్ డౌట్ నిబంధనలు సడలింపు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలలో దాదాపుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. 

 

 

 అయితే కొన్ని రాష్ట్రాలలో కరోనా  వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కేవలం మద్యం దుకాణాలను మాత్రమే తెరిచారు. మిగతా బార్లు పబ్బుల కి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే బార్ లు పబ్బులకు అనుమతి ఇవ్వడం కారణంగా ఎక్కువ మొత్తంలో ప్రజలు అక్కడికి చేరుకొని గుమిగుడటం  కారణంగా కరోనా  వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని భావించి అనుమతి ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వాలు. దాదాపుగా అన్ని రాష్ట్రాలలో ఇదే  నిబంధన కొనసాగుతోంది. కేవలం మద్యం షాపులకు మాత్రమే అనుమతులు ఇచ్చాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. 

 

 

 అయితే తాజాగా లాక్ డౌన్  సడలింపు లో భాగంగా ఇప్పటికే మద్యం షాపుల తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం తాజాగా బార్లు పబ్లు రెస్టారెంట్లు కూడా తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూ అనుమతులు ఇచ్చింది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు బార్లలో పబ్బులలో  రిటైల్  ధరలకు మద్యం అమ్ముకోవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కర్ణాటక ప్రభుత్వం. అయితే మద్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి ఉంటుందని లోపల సిట్టింగ్ కి  మాత్రం అనుమతి ఉండదు అంటూ స్పష్టం చేస్తోంది. కాగా  ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 789 కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: