అమ్మా... ఈ పేరుకు ఏదో తెలియని మహత్యం ఉంది..అందుకే బిడ్డ అమ్మా అన్న పిలుపుకు దాసిగా మారతాడు.. దేశాన్ని పాలించే రాజు అయిన, ఆకలికి ఏడ్చే బిక్షగాడు అయిన కూడా అమ్మా పేగును పంచుకొని పుడతాడు.. ఆ పిలుపు మనల్ని మంచి మార్గంలో నడిపించడమే కాదు.. మనతో అత్యున్నత శిఖరాలను అధరోహించెలా చేస్తుంది.. 

 

 

 

 

తన రక్త మాంసాలని దారపొస్తే కలసినదే ఈ శరీరం .. బిడ్డ కడపున పడిన తొలి నెల నుంచే బిడ్డకు ప్రపంచాన్ని చూపిస్తుంది.. ఒక్కో నెల పెరుగుతున్న కొద్ది భారం అవుతుంది అని ఏ తల్లి అనుకోదు.. బిడ్డకు నేను భారం కలిగించ కూడదని తల్లడిల్లి పోతుంది.. నెలలు నిండి ప్రసవానికి వెళితే బిడ్డ బయటకు వచ్చే వరకు ఎన్నో బాధలను .. ఇంకా చెప్పాలంటే 32 ఎముకలు విరిగితే ఎంత నొప్పి వస్తుందో అంతా నొప్పిని భరించి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది..

 

 

 

 

ఒక్కో అడుగు మనం వేస్తుంటే మురిసి పోతుంది.. చదువు కొనే వయసుకు మన వెన్నంటి ఉండి .. విద్య బుద్దులు నేర్పిస్తుంది.. పెళ్లి చేసుకొని వెళ్ళాక కన్నీటిని దిగమింగుకుని నా బిడ్డ సంతోషంగా ఉంటె చాలు అని ఆలోచిస్తుంది.. అందుకే భయ్య అమ్మకు పిరికెడు అన్నాన్ని పెట్టండి.. పరమానంలా భావించి బిడ్డ ఎదుగుదల చూసి మురిసి పోతుంది.. అలాంటి అమ్మను వృద్దాప్యం రాగానే స్పెషల్ కేరింగ్ అంటూ దూరం చేయకండి.. ముసలి ప్రాణం తట్టుకోలేదు.. డబ్బులో కాదు .. అమ్మ అన్న ఆప్యాయతతో దగ్గరకు తీసుకోండి.. అప్పుడే అమ్మా మన కళ్ళకు దేవత అవుతుంది.. అంతేకాదు వృద్ధాశ్రమాలు కూడా ఎక్కడ  కనిపించవు.. ఎవరు లేని వాళ్ళు అక్కడ ఉంటారేమో అన్నీ ఉండి కూడా అమ్మను అక్కడ వేయకండి.. చేసిన పాపం అదే జన్మలో అనుభవిస్తారు అంటారు. మన పిల్లలు మనకు ఎలా చూస్తారో.. తెలియదు.. అమ్మను ప్రేమించండి.. మనుషుల్లా మసలు కొండి.. హ్యాపీ మదర్స్ డే...

 

మరింత సమాచారం తెలుసుకోండి: