ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొత్త వివాదానికి తెర తీసింది. కరోనా వైరస్ మహమ్మారి వివరాలను ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే  భార‌త చిత్ర‌ప‌టంలో  అక్సాయిచిన్, జమ్ముకశ్మీర్, అరుణాచల్ రాష్ట్రాల‌ను అంతర్భాగంగా చూపించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాటిని వివాదాస్పద భూభాగాలు అన్నట్లుగా పేర్కొంది. పాకిస్థాన్ ముద్రించే మ్యాపులో మినహా అన్ని దేశాలు, అంతర్జాతీయ సంస్థలు జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా పేర్కొంటున్నాయి. భారత్, పాకిస్థాన్ల మ‌ధ్య 70 ఏండ్లుగా కశ్మీర్ వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. 

 

దీనిపై అనేక వంద‌ల సార్లు ఇరు దేశాలు ఐక్యరాజ్యసమితిలో పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో  డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్న మ్యాపు ప్ర‌పంచ దేశాల‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. వివాదం నడుస్తోంది కశ్మీర్‌పైనే. కాగా, డబ్ల్యూహెచ్ఓ పెట్టిన మ్యాపులో జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా వివాదాస్పద భూభాగాలుగా మార్కింగ్ చేయడం గ‌మ‌నార్హం. కానీ, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే డబ్ల్యూహెచ్ఓ మాత్రం అలా చూపించడం వివాదాస్పదం అవుతోంది. అయితే ఈ అంశంపై భారత‌ విదేశాంగ శాఖ ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. చైనాకు వ‌త్తాసు ప‌లుకుతూ వ‌స్తున్న ఐరాస‌, దాని అనుబంధ సంస్థ డ‌బ్ల్యూహెచ్‌వో తాజా వివాదంతో  ప్ర‌పంచ దేశాల విమ‌ర్శ‌ల‌కు త‌ప్ప‌క గుర‌వుతుంద‌ని నెటిజన్లు మండిప‌డుతున్నారు.


 1962 యుద్ధ సమయంలో అక్సాయిచిన్‌ను చైనా ఆక్రమించిన విష‌యం తెలిసిందే. అప్పటి నుంచి ఆ భూభాగం ఆ దేశం ఆధీనంలోనే ఉంటూ వ‌స్తోంది. అక్కడితో ఆగని చైనా అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం కూడా తనదే అంటూ ప‌లుమార్లు ప్ర‌క‌ట‌న చేస్తూ వ‌స్తోంది. అయితే భార‌త్ మాత్రం ఖండిస్తోంది.  కరోనా వైరస్ మహమ్మారి విషయంలో చైనాకు డబ్ల్యూహెచ్ఓ వెన్నుదన్నుగా నిలుస్తోందని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాతో సహా చాలా దేశాలు ఆ సంస్థ వైపు వేళ్లు చూపిస్తున్నాయి. డ‌బ్ల్యూహెచ్‌వో త‌ప్పిదం చైనాకు అనుకూలంగా మారింద‌నే చెప్పాలి. డ‌బ్ల్యూహెచ్‌వో త‌న త‌ప్పిదం స‌రిదిద్దుకుంటుందా..? లేక అగ్నికి ఆజ్యం పోస్తుందా..? అన్న‌ది వేచి చూడాలి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: