నరేంద్ర మోడీ... ప్రస్తుతం దేశాన్ని  ఒక తాటిపైకి తెచ్చి సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న ఒకే ఒక యోధుడు. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో అయినా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ... తనదైన భావజాలంతో ప్రజలకు ధైర్యం చెబుతూ దేశ ప్రజలందరికీ దిశానిర్దేశం చేస్తూ దేశ అభివృద్ధికి ముందుండి పాటుపడుతున్న గొప్ప వ్యక్తి. చరిత్ర లో ఉన్నది చదివేందుకు కాదు ఆ చరిత్రను సృష్టించేందుకు వచ్చాను అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించిన గొప్ప వ్యక్తి. దేశ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు... తనదైన పాలన సాగిస్తూ తనకు తిరుగు లేదు అని నిరూపించిన... దేశ రథసారథి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 

 

 

 మోడీ పాలనలో చరిత్ర సృష్టించిన అంశాలు ఎన్నో . భారత్ ను  ముందుండి నడిపిస్తున్న ఒక గొప్ప యోధుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పవచ్చు. అయితే ఎంతటి వాడైనా కన్నతల్లి ముందు ఎప్పటికీ చిన్నపిల్లవాడి అంటుంటారు. అది నరేంద్ర మోడీ విషయంలో నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. దేశాన్ని పాలిస్తూ  దేశాన్ని అభివృద్ధి చేసేలా  పాలన చేస్తూ... చరిత్ర సృష్టించిన గొప్ప యోధుడు లాంటి నరేంద్ర మోడీ... తన తల్లి హీరాబెన్ దగ్గరికి వెళ్ళగానే చిన్న పిల్లాడిలా మారిపోతాడు. తన అమ్మ అమ్మచేతి గోరుముద్దలను ఇప్పటికీ తింటూనే  ఉంటాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. 

 

 

 చాలా విషయాల్లో తన తల్లి ఆశీర్వాదాలు తీసుకుని పనులు ప్రారంభించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి పండుగకి దాదాపుగా సమయం దొరికినప్పుడల్లా తల్లి హీరాబెన్ తో  సమయం గడుపుతూ ఉంటారు. అయితే తన తల్లితో గడుపుతున్న సమయం లో ప్రధాని నరేంద్ర మోడీ ఆప్యాయత అనురాగాలను చూస్తుంటే ఎంత గొప్పవాడైనా తల్లి ముందు చిన్న పిల్లవాడు... తల్లి ప్రేమ ముందు అందరూ ఒక్కటే అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: