మాతృ దినోత్సవం రోజు అమ్మకు శ్రమను గుర్తించి ఆమెకు అభినందనలు తెలిపడమనేది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న మోడర్న్ సంప్రదాయం. ఐతే మనం ఈ సంవత్సరం మే 10వ తేదీన మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అనగా రేపు... ప్రతి ఒక్కరు మీ అమ్మ మీ కోసం ఇప్పటి వరకు చేసిన శ్రమను గుర్తించి ధన్యవాదాలు తెలపండి. తానే లేకపోతే మనం ఇక్కడ ఉండేవారం కాదు. సో, ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ... మీరు ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సంతోషపరచండి.

 

ఒకవేళ మీరు తనకు దూరంగా ఉన్నట్లయితే ఫోను చేసి శుభాకాంక్షలు తెలపండి. ఒకవేళ మీ అమ్మ మీతోనే ఉంటే... ఆమె కోసం మీరు కేక్ తయారు చేయండి. రేపు మీ అమ్మ చేసే పనిలో మీరు భాగస్వామ్యం అయ్యి ఆమెకు శ్రమను పూర్తిగా తగ్గించండి. రేపు మదర్స్ డే కాబట్టి మీరు ఏదో ఒకటి చేసి ఆమెను స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేయడం మీ బాధ్యత. అలాగే మేము ఈ కింద చెప్పిన విధంగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలపండి. 



1. అమ్మ, నా హృదయం లో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎప్పటికీ ఉంటుంది. నీకు నా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, అమ్మ.


2. నేను జన్మించిన క్షణం నుండి నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ పెద్ద చేసావు... నాకు అనారోగ్యంగా ఉంటే పూజలు చేశావు... నాకు సమస్య వస్తే వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు నడిపించావు... నా కలలను సాకారం చేసుకునేందుకు నీ జీవితాన్ని మొత్తం నాకే అర్పించావు. ఇవన్నీ నిస్వార్థంగా నా కోసం చేసిన నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అమ్మ. హ్యాపీ మదర్స్ డే, మా.


3. వందలో ఒక్కరు... కోట్లల్లో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించే ఒకే ఒక్కరు... నువ్వే అమ్మ. నీకు నా హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, అమ్మ


5. నువ్వు చేసే ప్రతి పని మా ఆనందం కోసమే. మా ఆనందంలోనే నీ ఆనందాన్ని చూసుకుంటావు. నీలాంటి అమ్మను పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ మదర్స్ డే టు యు, అమ్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: