అమ్మా.. రెండు అక్షరాల వెనక ఎంతో ప్రేమ దాగి ఉంది..ప్రపంచం ఎవరికి లేని అదృష్టం అమ్మ ఉన్న వాళ్లకు దక్కుతుంది.. అది నిజమే.. డబ్బులున్నవాడికి సెక్యూరిటీ ఉంటుంది.. కానీ ధనవంతుల కైన పేదవాడికి అయిన కూడా సమానంగా దొరికే ప్రేమ అమ్మ అనురాగం.. తన శరీరాన్ని పంచి, జన్మను ఇచ్చి అలానా పాలనా చూసి, మనల్ని తీర్చి దిద్దుతుంది.. మన అమ్మ ...ఒక్కో అడుగు మనం వేస్తుంటే మురిసి పోతుంది.. చదువు కొనే వయసుకు మన వెన్నంటి ఉండి .. విద్య బుద్దులు నేర్పిస్తుంది.. పెళ్లి చేసుకొని వెళ్ళాక కన్నీటిని దిగమింగుకుని నా బిడ్డ సంతోషంగా ఉంటె చాలు అని ఆలోచిస్తుంది.. అందుకే భయ్య అమ్మకు పిరికెడు అన్నాన్ని పెట్టండి.. పరమానంలా భావించి బిడ్డ ఎదుగుదల చూసి మురిసి పోతుంది..

 

 

 

 

 

లోకాలను ఏలే దైవం కూడా అమ్మ మాటకు కట్టుబడి ఉందని చెబుతున్నారు.. అందుకే వాళ్ళు దేవుల్లు అయ్యారు .. మనం ఇలా మనుషులం అయ్యాం.ఒక ప్రాణి ప్రాణం పోసుకోవాలి అంటే.. మరో ప్రాణం జీవితాన్ని అంకితం చేయాలి... అది అమ్మా అవుతుంది. భారతీయులు అందుకే అమ్మను దైవం లా పూజిస్తారు.. అందుకే మన సంప్రదాయాలని, సంసృతలను అందరూ గౌరవిస్తారు.. 

 

 

 

 

 

అమ్మ ప్రేమ ముందు అన్నీ చిన్నవే అందుకే .. ప్రపంచంలో ఎవరికీ దక్కని అదృష్టం అమ్మ విలువ తెలిసిన వాడికి దక్కుతుంది.. ఇకపోతే అమ్మానాన్న లేని వాళ్ళు ఎందరో అనాధులు ఆ ప్రేమను చనిపోయెలోగా ఒక్కసారైనా చూడాలని తపించి పోతున్నారు.  ఆ రోజు వారి ఆకలిని ఎవరైతే తీరుస్తారో వారిని అమ్మ అని మురిసిపోతారు.. వారికి అన్నం పెట్టిన వాళ్ళను అమ్మలగా భావించి దైవంలా పూజిస్తారు.. ఎవరికీ పుట్టారో తెలియదు..ఎలా పుట్టారో తెలియదు అలాంటి వాళ్లకు లేనిది మనకు ఉంది.. అదే అమ్మ .. అందుకే అమ్మను గుడి కట్టి పూజించక పోయిన పర్లేదు కానీ.. ఆమె కళ్ళ నుంచి కన్నీరు రానివ్వకుండా చూసుకోవడం మనిషిగా మన బాధ్యత..హెరాల్డ్ ను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు మీ సలహాలను మాకు అందిస్తున్న మా వీక్షకులకు.. హ్యాపీ మదర్స్ డే.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: