వైజాగ్ కి జగన్ కి విడదీయరాని బంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2014 ఎన్నికల టైంలో వైసిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వైజాగ్ ప్రాంతంలో పోటీ చేసి మొట్టమొదటిసారి వైఎస్ కుటుంబంలో ఓటమి అనేదాన్ని చవిచూడటం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న సమయంలో వైయస్ జగన్ వైజాగ్ విమానాశ్రయంలో కోడి కత్తి ద్వారా త్రుటిలో ప్రాణాపాయం నుండి బయట పడటం జరిగింది. అయితే తాజాగా అధికారంలోకి వచ్చాక జగన్ కి ఇటీవల వైజాగ్ నుంచి మరొక పెను సవాల్ ఏర్పడింది. అదేమిటంటే కరోనా వైరస్ వల్ల ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ ఉన్న సమయంలో విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి డేంజర్ గ్యాస్ తెల్లవారుజామున రిలీజ్ కావడంతో చాలామంది స్పృహ తప్పి పడిపోయారు.

 

ఈ ప్రమాదకరమైన గ్యాస్ పీల్చుకొని 12 మంది చనిపోగా, 200 మంది చికిత్స పొందుతున్నారు. పశువులు కూడా చనిపోవడం జరిగింది. బాధితుల చర్మం పై బొబ్బలు చిన్నారుల్లో జ్వరం న్యూమోనియా లక్షణాలు విషవాయువు స్టైరిన్ దుష్పరిణమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ గ్యాస్ పీల్చుకోవటం తో కొంత మంది ఆహారం కూడా తీసుకోలేక పోతున్నారు. అంతేకాకుండా మరికొంతమంది బాధితుల్లో కిడ్నీ కాలేయం పనితీరు లో కూడా స్పష్టమైన తేడా కనబడుతున్నటు సమాచారం. ఈ విష వాయువు వల్ల కొంతమంది చిన్నారులు కనీసం కళ్ళు కూడా తెరవలేకపోతున్నారు. 

 

ప్రమాదకరమైన ఈ ఘటనలో 500కు పైగా బాధితులు మిగిలిపోయారు. ఇందులో 52 మంది చిన్నారులు ఉన్నారు. మృతులు కుటుంబాలకు సీఎం జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. బాధితుల వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. స్వల్ప గాయాలైనవారికి వారికి కూడా పరిహారం ప్రకటించారు. ఇటువంటి సమయంలో చుట్టుపక్కల గ్రామస్తులు కంపెనీ ఇక్కడ నుండి ప్రభుత్వమే తొలగించాలని కోరుతున్నారు. దీంతో ఎక్స్గ్రేషియా కోటి రూపాయలు ప్రకటించిన గాని గ్రామస్తులు నుండి ...ఇటువంటి పెను సవాల్ ఎదురవడంతో అధికారులు మరియు నేతలు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కంపెనీ మీద దాడికి కూడా పాల్పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: