దాదాపు పది సంవత్సరాల పాటు పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ కి దెబ్బ మీద దెబ్బ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాడు జగన్. ఎంత పవర్ లో ఉన్నా గాని టైం కలిసి రాకపోతే జగన్ పరిస్థితి ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశీలకులు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఇచ్చిన ప్రతి మాటని అమలు చేస్తూ ప్రజలకు అద్భుతమైన సంక్షేమ పరిపాలన అందిస్తున్నాడు జగన్. ఇదే సమయంలో తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా కూడా హైలెట్ అవుతున్నాయి. అతి తక్కువ టైమ్ లోనే దేశంలో బాగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా మూడవ స్థానాన్ని దక్కించుకుని అందరికీ షాకిచ్చాడు.

 

అనుభవం లేదు పెద్దగా పరిపాలన ఏమీ ఉండదు అని భావించిన ప్రతిపక్షాలకు కూడా జగన్ తన నిర్ణయాలతో చేస్తున్న పరిపాలనతో ఊహించని విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా రివర్స్ దెబ్బ కొట్టడం జరిగింది. స్థానిక ఎన్నికల విషయం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తాజాగా విశాఖపట్టణం ఎల్జి పాలిమర్స్ కంపెనీ నిర్ణయాలు. స్థానిక ఎన్నికల విషయంలో అదే విధంగా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం గురించి ఏకంగా న్యాయస్థానం జగన్ సర్కార్ కి మొట్టికాయలు వెయ్యడం మనకందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇటీవల కరోనా వైరస్ తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా లాక్ డౌన్ లో ఉన్న సమయంలో విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి విషవాయువులు రావటంతో చాలా మంది అస్వస్థతకు గురైన విషయం అందరికీ తెలిసిందే.

 

ఈ విషయంలో ప్రతిపక్షాలు మరియు ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు జగన్ సర్కార్ ఇరుకున పెట్టాలని రెడీ అయిన తరుణంలో చనిపోయిన కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి తనలో ఉన్న గాట్స్ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా జగన్ చూపించాడు. దెబ్బకి ప్రతిపక్షాల నోటనుండి మాట రాని పరిస్థితి. ఇటువంటి సమయంలో గొడవ అంతా సద్దుమణుగుతుంది అనుకున్న సమయంలో కార్మికులంతా కంపెనీపై తిరగబడటం తో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చూసుకుంటే ఇది పెద్ద రాజకీయ పెను దుమారం సృష్టించే విధంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: