తమిళనాడు లో ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే మరో వైపు ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తూ వెళుతుంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం మద్యం షాపులు తెరుచుకోగా రెండు రోజుల్లో సుమారు 300 కోట్ల మద్యం అమ్మాకాలు జరిగాయి. అయితే మద్యం అమ్మకాల పై మద్రాస్ హైకోర్టు, ప్రభుత్వానికి  షాక్ ఇచ్చింది. కేవలం ఆన్లైన్ ద్వారా మద్యం డోర్ డెలివరీ చేయాలి తప్ప షాపులు ఓపెన్ చేయకూడదంటూ ఆదేశాలు జారీచేయడంతో నేటి నుండి మద్యం షాపులు మూతబడ్డాయి. ఇక తాజాగా టీ షాపుల ను తెరవడానికి అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ కస్టమర్లు కేవలం టీ పార్సెల్ మాత్రమే తీసుకెళ్లాలి .. అక్కడే ఉండి త్రాగడానికి మాత్రం వీలులేదని ఆంక్షలు విధించింది. మే 11నుండి చెన్నై లో తప్ప మిగితా ఏరియాల్లో టీ షాపులు తెరుచుకోనున్నాయి. అలాగే చెన్నైలో తప్ప మిగతా జిల్లాలో వున్న ప్రైవేట్ కంపెనీలు 33 శాతం స్టాఫ్ తో  విధులు నిర్వహించుకోవచడానికి కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. 
 
మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 5రోజుల నుండి రోజు 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ కరోనా కేసుల సంఖ్య 5000 దాటగా  37 మంది మరణించారు. ఒక్కచెన్నై లోనే 3000కుపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ రోజు కూడా తమిళనాడు లో భారీగా కేసులు నమోదయ్యాయని సమాచారం. ఇక ఓవరాల్ గా ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 60000 కు చేరగా అందులో 2000మంది మృత్యువాత పడ్డారు. మూడో దశ లాక్ డౌన్ కొనసాగుతున్నా కూడా కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి  లాక్ డౌన్ పొడిగించేలానే వుంది. ఈనెల 17తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: