మాతృదేవోభవ.... మొదటగా ప్రపంచంలో పూజించాల్సినది అమ్మ నే. ఆ తర్వాతే ఎవరైనా చివరికి ఆ దేవుడైనా సరే. ప్రపంచంలో అందరూ ఏదో ఒక పని లేదా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వారి వారి అర్హతలను, ఉద్యోగాలను బట్టి వారికి సంపాదన వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు కానీ కేవలం అమ్మ మాత్రమే వాటికి విలువ కట్టలేని పనులన్నీ చేయగలదు. మన దగ్గర నుంచి ఏదైనా ఎవరైనా ఆశించరు అంటే అది అమ్మ మాత్రమే. నిజంగా అమ్మ చేసే పనులకు ఆమె చేసిన సేవలకు మనం ఎన్ని కోట్లు ఇచ్చిన వెలకట్టలేనిది. ఈ అమ్మ తనం అనేది కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా అనేక సార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. అంతటి అమూల్యమైన సేవలను తల్లి తన బిడ్డలకు అందజేస్తుంది.

 


ప్రతిరోజు ఉదయం నుంచే మనకు అన్నిటికి దగ్గర ఉండి మనకు సహాయం చేస్తుంది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనకు ఒక్కరికే కాక ఇంట్లో ఉండే అందరికీ తను సహాయం అందజేస్తుంది. ఎవరైనా ఉద్యోగాలు చేసే వారు వారానికి ఒకటి లేదా రెండు రోజులు సెలవులు తీసుకుంటారు. కానీ అమ్మ దగ్గరికి వచ్చేసరికి అలాంటివి ఏమీ ఉండవు. మనకోసం అమ్మ ప్రతిరోజూ శ్రమిస్తూనే ఉంటుంది. అందుకే అమ్మ అనే పదానికి మనం వెలకట్టలేము. అమ్మ తన పని తాను చేసుకొవడం మాత్రమే కాకుండా మన ఇంట్లోని కుటుంబ సభ్యులందరి బాగోగులు కోసం అమ్మ ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటుంది. 

 


అంతేకాదు తన బిడ్డలకోసం తల్లి వీలైతే తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. తన బిడ్డల గెలుపు లోనే తన గెలుపును చూసుకునే వ్యక్తి తల్లి మాత్రమే. అయినా సరే కొంతమంది సమాజంలో వారివారి కన్నతల్లిని పట్టించుకోవడం లేదు అంటే నిజంగా బాధపడాల్సిన విషయమే. ఇది నిజానికి అత్యంత బాధాకరమైన విషయం. మనలను తొమ్మిది నెలలు మోసి, కని, పెంచి పెద్ద చేసి మనల్ని ఒక స్థాయికి ఎదిగేందుకు తోడ్పాటు అందించినా, ఆమెకు ప్రస్తుత రోజుల్లో గౌరవం దక్కడం లేదని చెప్పవచ్చు. నిజానికి ఇది మనం చేసుకున్న దౌర్భాగ్య స్థితి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటినుంచైనా మీ అమ్మ పట్ల ఆలోచించే వైఖరిలో మార్పు రావాలని ఆశిస్తూన్నాం. అమ్మ చేసిన పనులకు మనం ఎట్లాగు వెలకట్టలేము కాబట్టి మనం చేసేది ఒకే ఒక్కటి అది పాదాభివందనం మాత్రమే...!

మరింత సమాచారం తెలుసుకోండి: