దాదాపు 45 రోజుల పాటు లాక్ డౌన్ వల్ల దేశ వ్యాప్తంగా మందు దుకాణాలు మొత్తం మూత పడిపోయాయి. దేశంలో ప్రవేశించిన కరోనా వైరస్ కారణంగా కేంద్రం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి పెదవారి తో పాటు మందుబాబులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మందు అలవాటు పడిన గొంతుకి మందు లేకపోవటంతో కొంతమంది మానసిక వ్యాధి వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొనగా, మరికొంతమంది మద్యం కోసం దొంగలుగా మారి అనేక దుకాణాలు దోచుకున్నారు. ఇటువంటి సందర్భంలో మూడో దశ లాక్ డౌన్ పొడిగించిన సమయంలో మద్యం దుకాణాలకు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం పర్మిషన్ ఇవ్వడం మనకందరికీ తెలిసినదే. కేంద్ర అటూ ఆదేశాలు ఇవ్వడం జరిగిందో లేదో చాలా రాష్ట్ర ప్రభుత్వలు మద్యం దుకాణాలు ఓపెన్ చేయటంతో మందుబాబులు గుంపులు గుంపులుగా షాపుల మీద పడ్డారు.

 

రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. కానీ అంతలోనే మందుబాబులు చూపించిన అత్యుత్సాహం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చాలావరకు క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉండటంతో ముంబై లోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల వద్ద మందు బాబులు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, మాస్కులు ధరించకుండా వ్యవహరిస్తూ, కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుందని సమాచారం.

 

ముఖ్యంగా ముంబై లో కొన్ని ప్రాంతాల్లో మందు షాపులు వద్ద ప్రజలని అదుపు చేయటంలో చాలా కష్టతరం అవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మందు షాపులు క్లోజ్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. మందుబాబులు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మాస్క్ లేకుండా వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. నిత్యావసరాల వస్తువులు, మెడికల్ షాపులు మినహా మిగతా వాటినన్నిటిని కూడా మూసేస్తున్నట్లు ముంబై అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: