చంద్రబాబుకు విరహం అంటే పడదు. ఆయన అచ్చమైన చంద్రుడు కదా అందుకే విరహాన్ని ఎదుటివారికి కలిగించాలి కానీ తానే విరహ వేదన అనుభవించడం అన్నది అసలు కూడదు. కానీ బాబుకు ఇపుడు విరహం పట్టుకుంది. అదే పదవీ వియోగ విరహం. దాన్ని ఆయన కనీసంగా కూడా తట్టుకోలేకపోతున్నారు.

 

బాబు తన బాధను ఏ మాత్రం దాచుకోలేకపోతున్నారు. నిజానికి బాబుకు జగన్ని చూస్తే అసూయ ఉన్నట్లుంది. ఆయన బంపర్ మెజారిటీతో గెలవడం జనం మద్దతు సంపాదించేలా  పాలన చేయడంతో అది చూసి తట్టుకోలేకపోతున్నారు. విశాఖ బాధితులకు కోటి రూపాయలు నష్టపరిహారం జగన్ ప్రకటించారు. దాన్ని బీజేపీ, సీపీఐ సహా అన్ని పార్టీలు హర్షించాయి.  కానీ బాబు పార్టీ మాంత్రం విమర్శలు చేస్తూనే ఉంది.

 

శవ రాజకీయాలు టీడీపీ చేస్తోందని మంత్రి కొడాలి నాని అన్నారంటే అది నిజమేననిపిస్తోంది. బాధితులకు  కోటి రూపాయలు ఇచ్చారు. ప్రాణాలు ఇవ్వగలరా అంటూ బాబు అమాయకంగా మాట్లాడుతున్నారు. మరి బాబు టైంలో కూడా ఇలా ప్రమాదాల్లో  ఎంతో మంది చనిపోయారు. అపుడు ఆయన లక్షల్లోనే పరిహారం చెల్లించారు. మరి చనిపోయిన వారిని ఆయన తీసుకు రాగలిగారా అంటే సమాధానం చెప్పగలరా.

 

ఇక విశాఖలోని ఎల్జీ పాలిమార్స్ లో ఇప్పటికి ఎన్నోసార్లు ప్రమాదాలు జరిగాయి. అపుడు ముఖ్యమంత్రిగా బాబు ఉన్నారు. మరి ఆయన నాడు ఏం చేశారు. కర్మాగారం యాజమాన్యాన్ని ఎన్ని సార్లు అరెస్ట్ చేయించారు. ఇవన్నీ వైసీపీ నేతల ప్రశ్నలే కాదు, మేధావులు, నిపుణున నుంచి వస్తున్న ప్రశ్నలు, ఇంకా చెప్పాలంటే జనవాసాల మధ్య కర్మాగారం అంటున్నారు.

 


 మరి అటువంటి కర్మాగారానికి బాబు 2018లో 400 టన్నుల నుంచి 600 టన్నులకు ఉత్పత్తిని పెంచుకోమని ఎలా అనుమతించారు. ఇవన్నీ జనం మరచిపోతారని బాబు అనుకుంటున్నారా. ఈ రోజు  అక్కడ కర్మాగారం పుట్టిందా. లేక వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ కొబ్బరి కాయ కొట్టి ఆ కర్మాగారాన్ని ఏమైనా ప్రారంభించారా. 

 

బాబు కావాలనే రాజకీయం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని గట్టిగానే నోరు చేసుకున్నారు. మొత్తానికి బాబుకు హైదారాబాద్ లో ఉన్నా నిద్ర పట్టడంలేదుగా ఉంది. అందుకే విమర్శలకు పదును పెడుతున్నారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: