కరోనా వైరస్... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి విరుచుకుపడుతుంది. అంతే కాకుండా దీనితో ప్రజలకు అనేక విధాలుగా సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే ఏ చిన్న వస్తువుని ముట్టుకోవాలి అన్న కూడా ప్రజలు ఆలోచించ వలసిన పరిస్థితి ఏర్పడింది. స్మార్ట్ ఫోన్ పట్టుకోవాలన్న, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్.. ఇలా ఏది పట్టుకోవాలన్న కానీ ప్రజలలో కరోనా వైరస్ ఉంటుందేమో అనే భయంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక కరోనా వైరస్ ఏ వస్తువు మీద ఇక కరోనా వైరస్ ప్రభావం ఏ వస్తువు పైన ఎన్ని రోజులు ఉంటుందో తెలుసుకుందామా మరి. దీనిని అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది.

 


అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారు తెలియజేసిన ప్రకారం గ్లాస్ సర్ఫేస్‌పైన నాలుగు రోజుల వరకు, స్టెయిన్‌లెస్ స్టీల్‌, ప్లాస్టిక్‌ మూడు రోజుల వరకు, కాపర్ పైన నాలుగు గంటలు ,  కార్డ్‌బోర్డ్ పైన  ఒక్క రోజు ఉంటుంది అని ఇన్స్టిట్యూట్ అధికారులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా చేతులు శుభ్రం చేసుకున్న వాళ్లు అప్లై చేసిన వెంటనే ఫోను ముట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తలు వహించడం చాలా మంచిది అని అధికారులు సూచిస్తున్నారు. 

 


అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువ శాతం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. ఈ వైరస్ ప్రభావం పడకుండా ఉండాలి అంటే పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అని పలువురు అధికారులు  తెలియజేస్తున్నారు. ఇలా జాగ్రత్తలు పాటిస్తే నీ కరోనా వైరస్ని కట్టడి చేయవచ్చు అని యూనివర్సిటీ అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే ఏ వస్తువు ముట్టుకున్నా సరే దాన్ని శుభ్రం చేసి ముట్టు కోవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అని వైద్యులు తెలియజేస్తున్నారు.ఇంకా ఎందుకు ఆలస్యం జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్ ను కట్టడి చేసుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: