అసలు ఏ విషయాన్నైనా టీడీపీ నేతలు రాజకీయం చేయకుండా ఉండటం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష పాత్రకి పరిమితమైన చంద్రబాబు, ప్రతి విషయంపై రాజకీయం చేస్తూనే ఉన్నారు. అదేమంటే జగన్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. మొన్నటివరకు కరోనాపై రాజకీయం చేస్తూ వచ్చిన బాబు బ్యాచ్...ప్రస్తుతం విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

 

దురదృష్టం కొద్దీ జరిగిన ఈ ఘటనపై సీఎం జగన్ వెంటనే స్పందించి ఊహించని సాయం చేసారు. అయినా సరే టీడీపీ నేతలు ఆగడం లేదు. ఆఖరికి లోకేష్ కూడా సోషల్ మీడియా ద్వారా నాలుగు భారీ డైలాగులు వేశారు. అదే కోటి మీకిస్తాం చావడానికి సిద్ధమా? అని ముఖ్యమంత్రి జగన్‌ను, వైసీపీ మంత్రులను విశాఖ వాసులు, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు ప్రశ్నిస్తున్నారని మాట్లాడారు. అక్కడి ప్రజలు కంపెనీ వద్దని అంటుంటే, ప్రభుత్వం మాత్రం కంపెనీ ప్రతినిధులకు రెడ్‌కార్పెట్ వేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 

అయితే ఇలా ఓ రేంజ్ లో విశాఖ ఘటనపై రచ్చ చేస్తున్న టీడీపీ నేతలకు చెక్ పెట్టేందుకు మంత్రి కొడాలి నాని సడన్ ఎంట్రీ ఇచ్చారు. మీడియా సమావేశం పెట్టి బాబుతో సహా టీడీపీ నేతలని గట్టిగా తిట్టేసి, అసలు టీడీపీ హయాంలోనే కంపెనీ మొదలైందని, మొన్న కూడా అధికారంలో ఉన్నప్పుడే బాబు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ సాయం చేసారని, దాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, కోటి ఇస్తే బ్రతికివస్తారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

 

గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు సినిమా షూటింగ్‌ వల్ల 30 మంది చనిపోయారని, వాళ్లు బతికొస్తారనే చంద్రబాబు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారా అని ప్రశ్నించారు. అయితే కొడాలి చెప్పే మాటలు కరెక్ట్ అని, అప్పుడు నగరం ఘటనలో కూడా తక్కువ ఎక్స్‌గ్రేషియా ఇచ్చారని, అలా అని వాళ్ళు బ్రతికిరారు కదా! అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: