తెలుగు రాష్ట్రాలనే కాదు.. యావత్ భారత దేశాన్ని ఒక్క కుదుపు కుదిపేసిన అత్యంత విషాద సంఘటన విశాఖ వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్.   ఉదయం గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఏంటో అన్న విషయం తెలుసుకునే లోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది.  విషవాయువు పీల్చి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మనుషులు, పశు పక్ష్యాదులు అన్నీ అతలాకుతలం అయ్యాయి. విషవాయు ప్రభావంతో వైజాగ్ శివారు ప్రాంతం ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో 12 మంది మృత్యువాత పడగా, వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మంత్రి కన్నబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

 

ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయానికి ఎల్జీ పాలిమర్స్ ఇండస్ట్రీ మెయిన్ గేటు వద్ద 0.3 శాతం, గోపాలపట్నం, పెందుర్తి, వేపగుంటలో 0 శాతం, వెంకటాద్రినగర్ లో 0.3 శాతం, స్టోరేజి ట్యాంకు వద్ద 1.9 శాతం ఉందని తెలిపారు. గాలిలో విషవాయువు ప్రభావం వేగంగా తగ్గిపోతోందని చెప్పారు. విష వాయువు ప్రభావం తగ్గిపోతోందని దీన్నిబట్టే సులభంగా అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధ్యయనం కోసం కేంద్రం నియమించిన కమిటీ ఈ సాయంత్రం వైజాగ్ చేరుకుందని వివరించారు. ఫ్యాక్టరీ లోపలి పరిణామాల పరిశీలన కోసం ఓ కమిటీ నియమించామని, అది కాకుండా శాస్త్రీయ అధ్యయనం కోసం ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన నలుగురు నిపుణులతో మరో కమిటీ వేశామని చెప్పారు.

 

ఇక కమిటీ సభ్యుల విషయానికి వస్తే.. ప్రొఫెసర్ బాలప్రసాద్ (సివిల్ ఇంజినీరింగ్), ప్రొఫెసర్ ఎస్వీ నాయుడు (కెమికల్ ఇంజినీరింగ్), ప్రొఫెసర్ బాబూరావు (మెటలర్జికల్ ఇంజినీరింగ్), రిటైర్డ్ ఫ్రొఫెసర్ ఓ భానుకుమార్ (మెటియరాలాజికల్ మరియు ఓషనోగ్రఫీ) ఈ కమిటీలో ఉన్నారని వివరించారు. వీరితో పాటు  తిరుపతిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) నిపుణులను ఉన్నారని మంత్రి కన్నబాబు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: