విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన ఏపీ రాజకీయాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కోటి సాయం చేస్తే మనిషి ప్రాణాలు తిరిగొస్తాయా? అని టీడీపీ ప్రశ్నిస్తుంటే, అసలు చంద్రబాబే కంపెనీకి పర్మిషన్ ఇచ్చారని, గతంలో మీరు చేసిన సాయాల వల్ల మనుషులు తిరిగొచ్చారని అడుగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే విశాఖ పర్యటనకు చంద్రబాబు వెళ్లడంపై కూడా పెద్ద చర్చే నడుస్తోంది.

 

విశాఖ ఘటన జరిగిన రోజే సీఎం జగన్ హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి, బాధితుల్ని పరామర్శించారు. అయితే ఇదే సమయంలో లాక్ డౌన్ వల్ల హైదరాబాద్ లో చిక్కుకుపోయిన చంద్రబాబు కూడా విశాఖ వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసారు. ఇక కేంద్రం పర్మిషన్ ఇచ్చిందని, బాబు విశాఖ వెళ్లనున్నారని వార్తలు కూడా వచ్చాయి.

 

అయితే ఏమైందో తెలియదుగానీ బాబు మాత్రం విశాఖ పర్యటనకు వెళ్ళలేదు. వైసీపీ ప్రభుత్వంపై బాబుని వెళ్లకుండా అడ్డుకుంటుందని తెలుగు తమ్ముళ్లు కామెంట్లు చేసారు. ఇక దీనిపై స్పందించిన మంత్రి కొడాలి నాని...బాధితులను పరామర్శించేందుకు విశాఖకు రావడానికి చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదని,  బాధితులను పరామర్శిస్తే తనకు ఎక్కడ కరోనా వస్తుందో అని ఆయన విశాఖకు వెళ్లడం లేదని విమర్శించారు. అయినా చంద్రబాబుని విశాఖ వెళ్తానంటే ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నిస్తున్నారు.

 

ఇదే విషయంపై తెలుగు తమ్ముళ్లు స్పందిస్తూ... బాబు విశాఖకు వెళ్లకపోవడానికి ఓ రీజన్ చెబుతున్నారు. బాబు కేంద్రాన్ని పర్మిషన్ అడిగితే, అది ఏపీ డీజీపీ వద్దకు వచ్చిందని, కానీ డీజీపీ మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని, అందుకే బాబు విశాఖకు వెళ్లలేకపోయారని చెబుతున్నారు. అందుకే ముగ్గురు టీడీపీ సీనియర్ సభ్యులతో కమిటీ వేసి, జరిగిన ఘటనపై నిజానిజాల్ని తెలుస్తారని, కమిటీ ఇప్పటికే సంఘటన స్థలంలో పర్యటిస్తుందని, త్వరలోనే రిపోర్ట్ వస్తుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: