జగన్ చెప్పారంటే చేస్తారు...అందులో వేరే ఆలోచన ఉండదు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అలాగే జరుగుతుంది. ఒక మాట ఇచ్చారంటే..అది టైంకు నెరవేరుస్తారు. ప్రస్తుతం కరోనా సమయంలో ఇబ్బందులు ఉన్నాసరే ప్రజలకు పలు పథకాలు అందించారు. ఇక మద్యపాన నిషేధం విషయంలో కూడా జగన్...అలాగే ముందుకెళుతున్నారు.

 

ఎన్నికల హామీల్లో చెప్పినట్లుగా..అధికారంలోకి రాగానే దశలవారీగా మద్యపాన నిషేధం చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే 20 శాతం షాపులు క్లోజ్ చేసి, మిగతా షాపులని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం మొదలుపెట్టారు. అలాగే ధరలు పెంచితే మద్యం కొనుగోళ్లు తగ్గుతాయని ఆ పని కూడా చేసారు.

 

ఇక తాజాగా లాక్ డౌన్ లో సడలింపులు రావడంతో మరింతగా మద్యం ధరలు పెంచి, అమ్మకాలు మొదలుపెట్టారు. ఊహించని రీతిలో ధరలు పెంచిన మొదటిరోజు మందుబాబులు షాపులు దగ్గర ఎగబడ్డారు. అయితే 40 రోజులపైనే గ్యాప్ రావడంతో మందుబాబులు మొదటిరోజు ఎక్కువ వచ్చారు. కానీ రెండోరోజు నుంచి వైన్స్ దగ్గర మందుబాబుల తాకిడి తగ్గింది. అలాగే ఆదాయం కూడా తగ్గింది.

 

ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 20శాతం షాపులు తగ్గించిన ప్రభుత్వం తాజాగా మరో 13 శాతం షాపులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే షాపుల సంఖ్యను 2,934కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బెల్ట్ షాపులని ఎలాగో మూయించేసారు. ఇక బార్లని కూడా 40 శాతం తగ్గించేశారు.

 

అంటే జగన్ అనుకున్నట్లుగా దశల వారీగా మద్యపాన సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కాకపోతే ఇక్కడొక ఇబ్బంది ఉంది. మద్యం అందుబాటులో లేకపోతే నాటుసారా, కల్తీ కల్లు వినియోగం కూడా పెరిగిపోయే అవకాశముంది. అలాగే ఏపీకి పక్కనే ఉన్న రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ బోర్డర్ ఉన్న గ్రామాల్లో అలాగే జరుగుతుందని అంటున్నారు. వీటిని కూడా కంట్రోల్ చేయగలిగితే జగన్ ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయినట్లే అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: