పిల్లలకోసం అమ్మ పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. పిల్లలకోసం, కుటుంబం కోసం తల్లి పడే తపన మామూలుది కాదు. అందుకే అమ్మకోసం  జరిపే పండగే మదర్స్ డే. తల్లిని గౌరవించడానికీ, కృతజ్ఞతలు చెప్పుకోడానికీ ఒక రోజు మాత్రం  సరిపోదు. జీవితాంతం అమ్మ గూర్చి చెప్పిన సరిపోదు. ఈ మదర్స్ డే పిల్లలు తల్లి కష్టాన్ని గుర్తించడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారం ప్రపంచమంతటా మదర్స్ డే ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ మదర్స్ డే ను మే 10వ  తారీఖున జరుపుకుంటున్నాం. 

 

 

మదర్స్ డే సెలిబ్రేషన్స్ అమెరికాలో మొదలయ్యాయని చెబుతారు. ఆనా జార్విస్ అనే ఆవిడ తన తల్లి కి ఉన్న కోరిక ప్రకారం ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది. జార్విస్ తన తల్లి చనిపోయిన మూడు సంవత్సరాలకి, 1908 లో, వెస్ట్ వర్జీనియా లోని సెయింట్ ఆండ్రూస్ మెథడిస్ట్ చర్చ్ లో ఒక మెమోరియల్ ఏర్పాటు చేసింది. అప్పటినుంచి  మథర్స్ డే చేసుకుంటారు. తల్లే బిడ్డకు మొదటి గురువు. బిడ్డ కళ్ళు తెరిచి మొదట చూసేది అమ్మని, మొదట స్పర్శ అమ్మది, మొదట పలికే తొలి పలుకు అమ్మ.  పిల్లలకి ఆమే గురువూ, స్నేహితురాలూ అవుతుంది. తొంభై ఏళ్ళ వృద్ధులైనా ఏ కాలికో చేతికో దెబ్బ తగలగానే పలికే మాట 'అమ్మా' అనే. అందుకే ఈ ఇంటర్నేషనల్ మదర్స్ డే రోజున మీకు మీ తల్లి అంటే ఎంత ఇష్టమో ఆమెకి చెప్పండి. 

 

 

ప్రతి సంవత్సరం అమ్మకి దూరంగా ఎక్కడో  ఉండి  ఫోన్లో ఎదో ఒక మెసేజ్  చేసి శుభాకాంక్షలు చెప్పడం చేసేవాళ్ళం. కానీ ఈ లాక్ డౌన్ కారణంగా మీరు అందరు మీ ఇళ్లలోనే ఉంటున్నారు కాబట్టి అసలు వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏం లేదు. ఈ లాక్ డౌన్ సమయంలో మీ ప్రేమని  మీ అమ్మకి తెలియచెప్పడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.  తల్లిదండ్రులతో కలిసి ఉన్న అదృష్టవంతుల్లో మీరు కూడా ఉంటే మీ మదర్ కి ఇష్టమైన వంటకాలతో వంట చేసి పెట్టండి. స్వయంగా మీ చేతులతో మీరే వంట చేయండి.. మీకు రోజు వండిపెట్టి  పుట్టినరోజునా  స్పెషల్ చేసి మీకు పెడుతుంది కదా..అలాగే  మీరు జాబ్ లో జాయిన్ అయిన రోజునా - ఇలా ఎన్నిసార్లు ఆవిడ మీ కోసం స్పెషల్స్ చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఆవిడకిష్టమైన స్పెషల్స్ తో లంచ్ కానీ, డిన్నర్ కానీ ప్లాన్ చేయండి. ఎప్పట్నించో అనుకుంటూ చేయలేకపోయిన కేక్ ని ఈసారి బేక్ చేయండి. లేదా మఫిన్స్ చెయ్యండి. అమ్మ తో కేక్ కట్ చేయించండి. అమ్మ కళ్ళలో ఆనందాన్ని చుడండి. ఇంట్లో రెడీ గా ఉన్న వస్తువులతో మీరేం చెయ్యగలిగితే అది చెయ్యండి.ఆవిడ కోసం మీరేమైనా తయారు చెయ్యగలరేమో ఆలోచించండి.

 


ఒక మంచి గ్రీటింగ్ కార్డ్  రాసి, అందులో అమ్మ తో దిగిన మీ ఫోటో పెట్టి ఇవ్వండి. మీలో ఉన్న క్రియేటివిటీని బైటికి తీయండి.ఆవిడ కోసం మీరేమైనా తయారు చెయ్యగలరేమో ఆలోచించండి.ఫ్యామిలీ కలిసి బయటకు వెళ్లి ఛాన్స్ లేదు కాబట్టి   ఆవిడకిష్టమైన మ్యూజిక్ పెట్టుకుని అందరూ డాన్స్ చేయండి. బోర్ గా అనిపిస్తే కొన్ని స్నాక్స్ రెడీ గా పెట్టుకుని క్యారమ్స్, యూనో, లూడో లాంటి ఇండోర్ గేంస్ ఆడుకోండి.అమ్మకి ఈరోజు విశ్రాంతినివ్వండి.మనకోసం అలసిపోయిన అమ్మకి ఈ ఒక్కరోజు విశ్రాంతినిద్దాం... ఐ లవ్ యూ అమ్మ అని ప్రేమగా చెప్పి అమ్మ నుంచి ఆశీర్వాదం పొందండి...

మరింత సమాచారం తెలుసుకోండి: