కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయించడంతో దేశంలో అన్ని రంగాలు మూతపడ్డాయి. ఎక్కడికక్కడ పోలీసులు పహారా ప్రతి రాష్ట్రంలోపెట్టడంతో ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అడుగు తీసి అడుగు బయటకు వేయలేని నేపథ్యంలో పేదవాళ్లు మరియు మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగాలు లేక ఉపాధి లేక చేతిలో డబ్బులు లేక కుటుంబాన్ని నెట్టుకు రావడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొవడం జరిగింది. మొదటిలో ఏప్రిల్ 21 వరకు అనుకున్న గాని దాన్ని పొడిగిస్తూ.. దాదాపు మే 17వరకు లాక్ డౌన్ కొనసాగించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మూడో దశ లాక్ డౌన్ పొడిగించిన సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మందుబాబుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోవటం మనకందరికీ తెలిసిందే.

 

సడలింపు లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ మద్యం దుకాణాలు ఓపెన్ చేయటంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మద్యం దుకాణాలు ఓపెన్ అయిన బీరు కొనటానికి మందుబాబులు ముందుకు రావటం లేదట. మాకు వద్దే వద్దు అని అంటున్నారట. మామూలుగా అయితే మద్యం తాగే వాళ్ళు చాలా వరకు బీరు త్రాగటం కామన్. పైగా అందులో వేసవి కాలంలో అయితే ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి.

 

అటువంటిది లాక్ డౌన్ తరువాత దాదాపు బీరు అమ్మకాలు 60 శాతం తగ్గినట్లు ఏపీ స్టేట్ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పరిణామంతో ప్రభుత్వ వర్గాలకు ఏమైందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే కూడా 30 శాతం తగ్గిందని చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అనుకుంటున్న మద్యనిషేధ అమలు చేసే ప్రక్రియ విజయవంతం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: