అమ్మ... ఈ మాట ఒక్కటి చాలు జీవితంలో ఇంకేం అవసరం లేదు అనే వారు ఎందరో. ఎన్ని కష్టాలు వచ్చిన మనం చెప్పుకోవడానికి ఒకరు ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మ మాత్రమే. అమ్మ గురించి చెప్పే సందర్భాలలో ’అమ్మ అన్నది కమ్మని మాట…అది ఎన్నెన్నో జన్మల మమతల మూట’ అని ఒక సినీ కవి అమ్మ యొక్క గొప్పదనాన్ని ఎప్పుడో చెప్పాడు. నిజానికి దేవుడు లేడనే మనిషి ఉంటాడు కానీ, అమ్మ లేడను వారు అసలే ఉండడు అని కూడా అదే కవి చెప్పారు.

 

ఇంత పెద్ద సృష్టిలో ప్రతీ జీవికి అమ్మ కచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా సరే ప్రతీ జీవి జీవితం తన అమ్మతో ముడి పడి ఉంటుంది. నిజానికి మనకు అమ్మలేని ప్రపంచాన్ని ఊహించటం ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. ఇక నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసి తర్వాత తన ఆశలను తన బిడ్డలో చూసుకుని మురిసిపోయే అమ్మను భగవంతుడి రూపంలో ఉన్న దేవతగా పేర్కొంటారు. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ గురించి .... " గుడి లేని దైవం…అమ్మ" అని అనవచ్చు. ఇక అలాంటి అమ్మను మరిచిన వాడు నిజంగా వాడు జీవం ఉన్న బతికి ఉండడం వేస్ట్.

 

సృష్టిలో అందమైనది ఏదైనా ఉంది అంటే మొదటగా అది మన అమ్మ మాత్రమే. ఇక అమ్మ అంటే రేపటి మన భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు ఆమె. మనకు కావలిసినప్పుడు భగవంతుడు ఎక్కడ పడితే అక్కడకు రాలేక మనకు అమ్మను సృష్టించాడని మన వేదాలు చెబుతున్నాయి. ఇక పురాణం గ్రంథమైన ముస్లింలు దైవంగా కొలిచే పవిత్ర ఖురాన్‌లో కూడా స్వర్గం ఎక్కడ ఉందీ అన్న ప్రశ్నకు అంటే అమ్మ పాదాలకింద ఉందనే అసలైన సందేశాన్ని ఇచ్చారు అందులో.  కాబట్టి అదే అమ్మకు బుణం కొంతైనా తీర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం… మన అమ్మలందరికీ ’మదర్స్‌డే’ శుభాకాంక్షలు తెలుపుతూ .... ఇక సెలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: