విశాఖ పట్నంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకై 12 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ పరిశ్రమ తీరుపై అనేక కథనాలు వస్తున్నాయి. అసలు ఈ పరిశ్రమ ఏంటి.. ఏం తయారు చేస్తుంది.. ఎప్పటి నుంచి ఉంది. దీనికి అనుమతులు ఎవరు ఇచ్చారు వంటి అంశాలపై చర్చ జోరుగా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ను మంత్రి కొడాలి నాని బయటపెట్టారు.

 

 

ఈ ప్రమాదం జరిగిన తర్వాత టీడీపీ నాయకులు మీడియా ముందు చాలా విమర్శలు చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిశ్రమను జనావాసాల మధ్య ఎలా అనుమతించారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. అసలు విషయాన్ని మంత్రి కొడాలి నాని తాను బయట పెట్టానంటున్నారు. అదేటంటే.. అసలు ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీకి ఆ పేరు పెట్టిందే చంద్రబాబుట. మంత్రి కొడాలి నాని ఏమంటున్నారంటే.. “ వెన్నుపోటు పొడవడం వైయస్‌ జగన్, వైయస్‌ రాజశేఖరరెడ్డి రక్తంలో లేదు. ఈ రోజు నీతులు చెప్పే చంద్రబాబు..ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 1998లో అదే కంపెనీలో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. ఆ రోజు చంద్రబాబు ఏం చేశారు. అనేక మంది గాయాలపాలై ఈ రోజు కూడా జీవచ్ఛవంలా మారారు. ఆరోజు చంద్రబాబు బ్రోకర్‌ పనులు చేశారు.. అంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

 

 

అంతే కాదు.. అప్పటి వరకూ.. హిందుస్థాన్‌ పాలిమర్స్‌ గా ఉన్న కంపెనీని కొరియన్‌కు చెందిన ఎల్‌జీ పాలిమర్స్‌గా చేసింది చంద్రబాబు కాదా?. ఆ రోజు జనం తక్కువగా ఉన్నారంటూ నీతులు చెబుతున్నారు. అక్కడి కంపెనీని పెద్ద స్థాయిలో పెంచుకోమని 2017లో చంద్రబాబే అనుమతులు ఇచ్చారు.. 2019లో చంద్రబాబు దిగేపోయే సమయంలో ఆ కంపెనీ విస్తరణకు మరో ఐదేళ్ల గడువు పెంచింది ఈ దద్దమ్మ, మాటలు చెప్పే సన్యాసినే. ఆ రోజు చంద్రబాబు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు.. అంటూ నిలదీశారు మంత్రి కొడాలి నాని. మరి నాని చెప్పిన విషయాలు వాస్తవమైతే నిజంగా దారుణమే. చూడాలి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: